Ambani News: ముఖేష్ అంబానీకి జియో అనే పేరు బాగా కలిసొచ్చినట్లుంది. ఈ పేరుతో ముందుకెళుతున్న వ్యాపారాలు అత్యంత వేగంగా విస్తరిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి.
గత ఏడాది అదానీకి చెందిన జియో ఫైనాన్షియల్ వ్యాపారాన్ని రిలయన్స్ గ్రూప్ నుంచి విడదీసి ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అంబానీకి చెందిన ఫైనాన్స్ వ్యాపారాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగా మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారంలో వస్తోంది. జియో ఫైనాన్షియల్-బ్లాక్‌రాక్ కంపెనీలు సంయుక్తంగా దీని కోసం అవసరమైన అనుమతులు పొందేందుకు సెబీకి దరఖాస్తు చేశాయి.

అమెరికాకు చెందిన బ్లాక్‌రాక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ భారీ స్థాయిలో ఆస్తులను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రఖ్యాత పెట్టుబడి సంస్థతో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జాయింట్ వెంచర్ మార్కెట్ కలిగి ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి మ్యూచువల్ ఫండ్స్ లైసెన్స్ కోసం చేసిన దరఖాస్తు ప్రస్తుతం పరిశీలనలో ఉంది. వాస్తవానికి ఈ రెండు కంపెనీలు 50:50 ప్రాతిపధికన ఒక్కొక్కరు 150 మిలియన్ డాలర్ల పెట్టుబడితో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడానికి జూలై 2023లో ఒక ఒప్పందాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
జియో బ్లాక్‌రాక్ దేశంలోని పెట్టుబడిదారులకు సరసమైన, వినూత్న పెట్టుబడి పరిష్కారాలను అందించే లక్ష్యంతో ముందుకొస్తున్నట్లు రిలయన్స్ గ్రూప్ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో మ్యూచువల్ ఫండ్స్ వ్యాపార విలువ దాదాపు 580 బిలియన్ డాలర్లుగా ఉన్నందున జియో ఫైనాన్షియల్ దీనిపై ప్రధానంగా దృష్టి సారించింది. మార్కెట్ నైపుణ్యంతో పాటు పెట్టుబడి, రిస్క్ మేనేజ్‌మెంట్‌లో విస్తృతమైన నైపుణ్యాన్ని కలిగి ఉన్న బ్లాక్‌రాక్ 2022 నాటికి మొత్తం 8.2 ట్రిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి ఉందని సమాచారం.


Click it and Unblock the Notifications