Jio Finance: యాపారం మెుదలెట్టిన జియో ఫైనాన్స్.. లోన్ కావాలంటే ఏమేమి అవసరం..??
Jio Finance: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లెండింగ్ విభాగమైన జియో ఫైనాన్స్ తన రుణ కార్యకలాపాలను ప్రారంభించింది. ఇటీవల ఐపీవోతో ప్రత్యేక కంపెనీగా ఏర్పడిన తర్వాత పర్సనల్ లోన్స్, కన్జూమర్ లోన్స్, మర్చంట్ లోన్స్ అందించేందుకు ముందుకొచ్చింది.
జియో ఫైనాన్షియల్ 23-58 ఏళ్ల మధ్య వయస్సు గల జీతం లేదా స్వయం ఉపాధి కలిగిన వ్యక్తులకు రుణాలను ఆఫర్ చేస్తోంది. రుణాలను పొందాలనుకునే వారు మైజియో అప్లికేషన్ ద్వారా రూ.3 లక్షల వరకు డిజిటల్ లోన్స్ పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. ఇందుకోసం రుణగ్రహీతలు తమ పాన్, ఆధార్ వివరాలను అందించాల్సి ఉంటుంది. కన్జూమర్ డ్యూరబుల్ లోన్ కింద మెుబైల్స్, ఏసీ, కెమెరాలు వంటి ఉత్పత్తులను జియో ఫైనాన్స్ అందిస్తోంది. వీటిని వ్యాపారి వెబ్ సైట్లలో నోకాస్ట్ ఈఎంఐ కింద అందుబాటులో ఉంచింది. వీటిని 21-60 ఏళ్ల మధ్య వ్యక్తులకు ఆఫర్ చేస్తోంది.

ఇక వ్యాపారుల విషయానికి వస్తే.. ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు లేదా డీలర్‌లచే సాధారణంగా సబ్సిడీతో అందించబడే కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్‌లను అందుబాటులో ఉంచింది. ఇది వినియోగదారులకు నో-కాస్ట్ EMI ఎంపికల నుంచి ప్రయోజనం పొందేలా చేస్తుంది. ఇందులో కస్టమర్లు ప్రాసెసింగ్ రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. బి2బి హోల్‌సేల్ లిస్టెడ్ వ్యాపారులకు ఇన్వెంటరీ కొనుగోలు అవసరాలకు అన్‌సెక్యూర్డ్ మర్చంట్ ట్రేడ్ క్రెడిట్ సౌకర్యాన్ని విస్తరించింది.
కంపెనీ ఆటోమెుబైల్ రుణాలు, హోమ్ లోన్స్, షేర్లపై రుణాలను అందించాలని చూస్తోంది. JIo ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది రిజర్వు బ్యాంక్ ఆమోదిత డిపాజిట్లు తీసుకోని NBFC. జియో ఫైనాన్షియల్ అనుబంధ సంస్థలుగా.. జియో ఫైనాన్స్, జియో ఇన్సూరెన్స్ బ్రోకింగ్, జియో పేమెంట్ సొల్యూషన్స్, జియో పేమెంట్స్ బ్యాంక్--స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కూడిన జెవికి హోల్డింగ్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications