జియో - ఫేస్‌బుక్ ఒప్పందం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆసియా కుబేరుడి స్థానాన్ని తిరిగి దక్కించుకున్నారు. బ్లూమ్‌బర్గ్ ఆసియా కోటీశ్వరుల జాబితాలో ఇప్పటి వరకు ప్రథమ స్థానంలో ఉన్న అలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా స్థానాన్ని ముఖేష్ అధిగమించారు. రిలయన్స్ జియోలో ఫేస్‌బుక్ 9.99 శాతం వాటాను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో అంబానీ ఆస్తులు 4.7 బిలియన్ డాలర్లు పెరిగి 49.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

ముఖేష్ 17, జాక్ మా 19
ఫేస్‌బుక్‌తో జరిగిన ఒప్పందం కారణంగా ముఖేష్ ఆసియాలో అత్యంత ధనికుడి స్థానాన్ని తిరిగి దక్కించుకున్నారు. బుధవారం రిలయన్స్ లాభం 10% పెరిగి ముఖేష్ ఆస్తి 49.2 డాలర్లకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ 17వ స్థానంలో, జాక్ మా 19వ స్థానంలో ఉన్నారు. జాక్ మా ఆస్తులు 46 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

14 బిలియన్ డాలర్లు క్షీణించి..
ఫేస్‌బుక్-జియో డీల్‌కు ముందు 2020లో అంబానీ సంపద 14 బిలియన్ డాలర్లు క్షీణతను నమోదు చేసింది. ఆసియాలోనే డాలర్ పరంగా అతిపెద్ద పతనం. ఇప్పుడు 3 బిలియన్ డాలర్ల సంపద పెరిగింది. అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ లిమిటెడ్ మంగళవారం నాటికి 1 బిలియన్ డాలర్లు కోల్పోయింది. గత రెండు మూడు దశాబ్దాలలో చమురు మొదటిసారి దారుణంగా పడిపోయింది. దీంతో అంబానీ ఆస్తులు తగ్గిపోయాయి.

26.2 శాతం కుంగిన రిలయన్స్ ఆస్తులు
చమురు ధరలు భారీగా పడిపోవడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆస్తులు 2020లోనే ఏకంగా 26.2 శాతం మేర కుంగిపోయాయి. చమురు ధరలు ఇటీవల ఏకంగా సున్నా కంటే తక్కువకు పడిపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆదాయం ఎక్కువగా చమురు ధరలపై కూడా ఆధారపడి ఉంటుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications