రిలయన్స్ జియో-ఫేస్‌బుక్ ఇటీవల5.7 బిలియన్ డాలర్ల కీలక ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. స్థానిక దుకాణదారులు, కిరాణా స్టోర్స్‌కు ఊతమిచ్చేలా ఈ ఒప్పందం ఉంది. ఇది ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు గట్టి దెబ్బ కానుంది. ఈ నేపథ్యంలో అమెజాన్ అప్రమత్తమైంది. ఫేస్‌బుక్ - జియో డీల్ అనంతరం అమెజాన్ స్థానిక కిరణా స్టోర్స్ నుండి అమ్మకాలు ప్రారంభించింది.

అమెజాన్ 6 నెలల పైలట్ ప్రాజెక్టు
'లోకల్ షాప్స్ ఆన్ అమెజాన్' పేరుతో పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది అమెజాన్. ఇది ఆరు నెలల పాటు కొనసాగుతుంది. దేశంలోని 100కు పైగా నగరాలలో 5వేల స్థానిక రిటైల్ షాపుల భాగస్వామ్యంతో కిరాణ్, ఇతర అవసరమైన సరుకులను వినియోగదారులకు అందించనుంది. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో అత్యవసర వస్తువులతో పాటు ఇతర ఉత్పత్తుల విక్రయానికి కూడా అనుమతివ్వాలని రిటైలర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ సమయంలో అమెజాన్ తాజా వ్యూహంతో ముందుకు వచ్చింది.

ఇవన్నీ దొరుకుతాయి
వినియోగదారులు దగ్గరలోనే సాధ్యమైనంత ఎక్కువ సెలక్షన్, వేగవంతమైన డెలివరీ ఉంటుందని, స్థానిక దుకాణాలను ఇది డిజిటల్ స్టోర్స్‌గా మారుస్తుందని అమెజాన్ ఇండియా సెల్లర్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ గోపాల్ పిళ్లై అన్నారు. అమెజాన్ లోకల్ షాప్స్ ద్వారా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ నుండి మ్యాట్రెస్, కిచెన్ ఐటమ్స్, గ్రాసరీ, కన్స్యూమర్స్, అప్పారెల్, షూస్, గిఫ్ట్, తాజా పూవులు, కేక్స్ వంటి వివిధ వస్తువులను కొనుగోలు చేయవచ్చు.

ఈ నగరాల్లో..
టాప్ మెట్రోలు, టైర్ 1, టైర్ 2 నగరాలు బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, పూణే, జైపూర్, అహ్మదాబాద్, కోయంబత్తూర్, సూరత్, ఇండోర్, లక్నో, సహారాన్‌పూర్, ఫరీదాబాద్, కోటా, వారణాసి తదితర నగరాల్లో రిటైలర్స్ సిద్దంగా ఉన్నారని అమెజాన్ తెలిపింది. స్థానిక దుకాణాల నుండి తమకు కావాల్సింది ఎంపిక చేసుకోవడం, వేగవంత డెలివరీతో కస్టమర్లకు ప్రయోజనం, దుకాణదారులకు తమ ప్రాంతానికి మించి వ్యాపారం విస్తరించుకోవడానికి అవకాశం.. మొత్తానికి ఇది విన్ టు విన్‌గా ఉంటుందని తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్టు కోసం రూ.10 కోట్ల పెట్టుబడితో 100కు పైగా నగరాల్లో 5,000 మంది స్థానిక దుకాణాలను, రిటైలర్లను తన ప్లాట్ ఫాంలో చేర్చుకుంటామని తెలిపారు.

స్థానిక కిరాణాలతో జత
ప్రపంచంలో ఎక్కడైనా ఇండియాలోని స్థానిక షాప్స్ సరుకుల్ని ఆన్‌లైన్ ద్వారా విక్రయించుకోవడానికి తమ టెక్నాలజీని వినియోగించుకోవచ్చునని అమెజాన్ ఇండియా తెలిపింది. వినియోగదారులకు ఖచ్చితమైన డెలివరీ కోసం అమెజాన్ డెలివరీ యాప్‌ను ఉపయోగించాలని, అన్ని సరుకుల రవాణాను రోజూ ట్రాక్ చేస్తామని తెలిపింది. తాము స్థానిక కిరాణా దుకాణాలతో జత కడతామని అమెజాన్ ఇండియా తెలిపింది. ఐ హావ్ స్పేస్ ద్వారా డెలివరీ, పికప్ పాయింట్స్‌గా పని చేసి అదనపు ఆదాయం పొందవచ్చునని కూడా అమెజాన్ తెలిపింది. అలాగే వాకిన్ కస్టమర్లకు అమెజాన్ ఈజీని అందుబాటులోకి తెచ్చింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications