Jio: జియోలో రూ.189కే అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్..!
ఒకప్పుడు చాలా మంది రెండు, మూడు సిమ్ లు వాడే వాళ్లు. డ్యూయల్ సిమ్ ఫోన్ లో రెండు సిమ్స్ యాక్టివ్ గా ఉండేవి. కానీ క్రమంగా టెలికాం కంపెనీలు తమ రూట్ మార్చాయి. రీఛార్జ్ ధరలు భారీగా పెంచాయి. ఒకప్పుడు రీఛార్జ్ చేయకున్నా ఇన్ కమింగ్ యాక్టివ్ గా ఉండేది. కానీ ఇప్పుడు ఇన్ కమింగ్ ఉండాలంటే కనీస రీఛార్జ్ చేయాల్సిందే. అయితే ఈ కనీస రీఛార్జ్ ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. అయితే కొంత మంది కేవలం కాల్స్ కోసమే మొబైల్ వాడుతుంటారు. ముఖ్యంగా చదువు రానివారు ఇన్ కమింగ్ కోసం ఫోన్ వాడతారు. కొంత మంది ఔట్ గోయింగ్ కూడా వాడతారు. కానీ నెట్ వాడలేరు.
దీంతో వారు నష్టపోవాల్సి వస్తుంది. అయితే కేవలం కాల్స్ కోసం టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్లు తీసుకొచ్చాయి. అయితే వీటికి కూడా ధర ఎక్కువగా ఉంది. అయితే జియో తక్కువ ఖర్చుతో అధిక కనెక్టివిటీ కోసం ఓ ప్లాన్ తీసుకొచ్చింది. అదే రూ.189 ప్లాన్. ఇది ప్రారంభ రీఛార్జ్ ప్లాన్. వాయిస్ కోసం మాత్రమే వాడేవారికి ఇది చక్కగా ఉపయోగపడుతోంది. రూ.189 రీఛార్జ్ ప్లాన్‌లోని ప్రధాన అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకునే సదుపాయం ఉంది. ఎంతసేపైనా ఫోన్ మాట్లాడుకోవచ్చు. భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా లోకల్, STD, రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు.

ఈ ప్లాన్ లో కాస్త డేటా కూడా ఇస్తున్నారు. ఈ ప్లాన్‌లో మొత్తం 2GB హై-స్పీడ్ డేటా ఉంటుంది. ఇది మెసేజింగ్, బ్రౌజింగ్, అప్పుడప్పుడు సోషల్ మీడియా వాడకం వంటి అవసరమైన పనుల కోసం వాడుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. ఈ 2జీబీ డేటాను 28 రోజుల పాటు వాడుకోవచ్చు. ఈ ప్యాకేజీలో 300 SMS ఉచితంగా ఉంటాయి. సెకండరీ సిమ్ కార్డుల కోసం లేదా ప్రధానంగా Wi-Fiపై ఆధారపడి ఉన్నవారికి కూడా ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్లాన్ లో ప్రైమరీ కాలింగ్,డేటాతో పాటు, జియో తన సిగ్నేచర్ డిజిటల్ వాల్యూ-యాడ్స్‌ను కూడా అందిస్తోంది.
ఈ ప్లాన్ లో కాంప్లిమెంటరీ కూడా ఉంది. జియోటీవీ యాకిస్స్ ఉంటుంది. ఇందులో వినోద ఛానెళ్ల లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. జియోక్లౌడ్ యాక్సెస్ ఉంటుంది. మీరు జియో క్లౌడ్ లో ఫోటోలు , డాక్యుమెంట్ల భద్రంగా స్టోర్ చేసుకోవచ్చు. అయితే జియోలో ప్రధాన సమస్య ఏమిటంటే సరిగా సిగ్నల్ రాకపోవడం. హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా సిగ్నల్ సరిగా రాదు. ముఖ్యంగా 5జీ నెట్ చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే వస్తుందని పలువురు వినియోగదారులు చెబుతున్నారు. జియో నెట్ వర్క్ మెరుగుపరుచుకోవడం చాలా అవసరమని సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications