Jio Cinema: ముకేష్ అంబానీకి చెందిన స్ట్రీమింగ్ సర్వీస్ జియో సినిమాకు ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లను కంపెనీ కస్టమర్లకు ఉచితంగా అందిస్తోంది. అయితే ఐపీఎల్ పూర్తయ్యాక ప్లాన్స్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
కస్టమర్లను ఆకర్షించేందుకు ఉచితాలను ప్రకటించిన జియా త్వరలోనే సబ్‌స్క్రిప్షన్ సర్వీసును ప్రవేశపెట్టాని యోచిస్తోంది. ప్లాట్‌ఫారమ్‌లో కంటెంట్‌ను వినియోగించడం ప్రారంభించడానికి మీరు ఖాతాను సృష్టించాలి. అయితే ఇది త్వరలో మారవచ్చని తెలుస్తోంది. ఇందుకోసం కంపెనీ మెుత్తం మూడు వివిధ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తోందని తెలుస్తోంది.

లీకైన ఫోటోలోని వివరాల ప్రకారం.. బేసిక్ ప్లాన్ కేవలం ఒక్కరోజుకు తీసుకునేవారికి రూ.2 రుసుమును జియో నిర్ణయించింది. ఇక మూడు నెలల ప్లాన్ వివరాలను గమనిస్తే దీనిని గోల్డ్ ప్యాక్ పేరుతో రూ.99కి కంపెనీ అందించనుంది. అలాగే ఏడాదికి అంటే 12 నెలల ప్యాక్ కేవలం రూ.599గా జియో అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే ఈ ధరలు డిస్కౌంట్ తర్వాత చెల్లించాల్సిన మెుత్తాలు.
డిస్కౌంట్ కి ముందు రోజువారీ ప్లాన్ ధర రూ.29గా ఉండగా.. మూడు నెలల ప్యాక్ రూ.299గా ఉంది. ఇక ఏడాది ప్లాన్ అసలు ధర రూ.1199గా ఉంది. ఈ క్రమంలో నెల, మూడు నెలల ప్యాన్స్ సబ్‌స్క్రిప్షన్ తీసుకునే వారికి ఏకకాలంలో రెండు డివైజెస్ లాగిన్ అనుమతిస్తుండగా.. ఏడాది ప్లాన్ తీసుకుంటే నాలుగు డివైజెస్ కనెక్ట్ చేసుకునేందుకు కంపెనీ అనుమతిస్తోంది. అయితే ఈ వివరాలు Reddit లీక్ చేసిన ఫోటో ద్వారా తెలిసినవి. అయితే ఈ రేట్లను కంపెనీ అధికారికంగా నిర్థారించలేదు.
టాటా ఐపీఎల్ 2023 తర్వాత జియో సినిమా కొత్త ప్లాన్లను ప్రారంభించవచ్చని తెలుస్తోంది. ఇందుకోసం ప్లాట్‌ఫారమ్ 100కి పైగా సినిమాలు, TV సిరీస్‌లను జోడించడం ద్వారా తన కంటెంట్ లైబ్రరీని విస్తరించాలని యోచిస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications