మీ జియో పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలో ఉన్న అదనపు డబ్బు వృథా కాకుండా, చక్కగా వృద్ధి చెందడానికి ఒక సూపర్ సౌకర్యం వచ్చింది! 'సేవింగ్స్ ప్రో' అనే కొత్త ఫీచర్ ను లాంచ్ చేసింది. దీని ద్వారా ఖాతాదారులు తమ ఖాతాలో ఉన్న అదనపు డబ్బు ద్వారా రాత్రికి రాత్రే మ్యూచువల్ ఫండ్స్ గ్రోత్ ప్లాన్లో ఆటోమేటిక్ పెట్టుబడులు పెట్టి, ఎక్కువ ఆదాయం పొందగలుగుతారు.
కేవలం కొన్ని క్లిక్స్‌తోనే మీరు మీ జియో ఖాతాను సేవింగ్స్ ప్రోగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. మీరు ముందుగా మీకు కావలసిన కనీస పరిమితి మొత్తం ఉదాహరణకు రూ.5,000 ని సెట్ చేయాలి. ఆ తరవాత మించిపోయిన అదనపు డబ్బు ఆటోమేటిక్‌గా మీరు ఎంచుకున్న ఓవర్‌నైట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టబడుతుంది. ఇవి చాలా తక్కువ రిస్క్ ఉన్న ఫండ్స్ కాబట్టి, ఎలాంటి టెన్షన్ లేకుండా నిశ్చింతగా పెట్టుబడి పెట్టవచ్చు.

రోజుకు గరిష్టంగా రూ.1,50,000 వరకు మీరు పెట్టుబడి పెట్టొచ్చు. డబ్బు తిరిగి తీసుకోవడం మాత్రం SEBI నిబంధనల ప్రకారం జరుగుతుంది. మీరు పెట్టిన మొత్తంలో 90% వరకు వెంటనే ఇన్స్టంట్ గా తీసుకోవచ్చు, కానీ ఒక్కసారిగా తీసుకునే ఇన్స్టంట్ డబ్బు మాత్రం రూ.50,000 వరకు మాత్రమే వస్తుంది. దానికి మించిన డబ్బు మాత్రం 1-2 పని రోజుల్లో మీకు వస్తుంది.
సేవింగ్స్ ప్రో ఫీచర్ ఒక ప్రత్యేకత ఏమిటంటే, మీరు ప్రతీ రోజు లేదా ప్రతీ నెల ఖాతా చూసి, "ఎంత పెరిగిందో" అనుకోవాల్సిన అవసరం లేదు. డబ్బు స్వయంగా, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల ప్రకారం వృద్ధి చెందుతుంది.
ఈ ఫీచర్ వలన, మీరు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, మీ డబ్బు తన పని చేస్తూ, ఎక్కడా ఆలస్యం లేకుండా పెరుగుతుంది. చిన్న మొత్తంలో పెట్టిన డబ్బు కూడా స్మార్ట్ పెట్టుబడిగా, మీకు అదనపు ఆదాయం ఇస్తుంది. అంటే, ఖాతాదారుల కోసం ఇది ఒక సులభమైన మార్గం. మీరు కేవలం సెట్టింగ్ చేసేయండి, డబ్బు మీ కోసం సైలెంట్ గా వృద్ధి చెందుతుంది.
మొత్తం ప్రాసెస్ పూర్తిగా జియో ఫైనాన్స్ యాప్ ద్వారానే డిజిటల్‌గా, చాలా సులభంగా జరుగుతుంది. సేవింగ్స్ ప్రోలో ఎంట్రీ లేదా ఎగ్జిట్ ఛార్జీలు లేవు, దాచిన ఫీజులు కూడా లేవు. లాక్-ఇన్ పీరియడ్ లేకపోవడంతో ఎప్పుడైనా డబ్బు తీసుకోవచ్చు. అలాగే, మీరు పెట్టుబడి ఎలా పెరుగుతుందో పూర్తి క్లారిటీగా చూడగలుగుతారు. మీకు కావాలంటే పరిమితి మొత్తంని మార్చుకోవచ్చు. అలాగే, ఏ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలో మీరు ఎంచుకోవచ్చు. పెట్టుబడి పై వచ్చే రిటర్న్స్ను కూడా ఎప్పటికప్పుడు సులభంగా ట్రాక్ చేయవచ్చు. అంటే, మొత్తం పెట్టుబడి మీద పూర్తి కంట్రోల్ మీ చేతుల్లోనే ఉంటుంది.
కాబట్టి, సేవింగ్స్ ప్రో ద్వారా మీ ఖాతాలోని అదనపు డబ్బును సులభంగా పెంచి, పూర్తి నియంత్రణలో పెట్టి, గరిష్ట లాభాలు పొందగలరు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications