Piramal Realty: భారత వ్యాపార రంగంలో అంబానీల ప్రస్థానం చాలా పెద్దది. అనేక రంగాల్లో పెను సంచలనాలకు తెరలేపిన వ్యాపార కుటుంబం వారిది. ఏదైనా వ్యాపారంలోకి అడుగుపెట్టాలని నిర్ణయిస్తే అందులో నెం-1గా మారటమే లక్ష్యంగా ముందుగు వేయటంలో ముఖేష్ అంబానీకి మించినవారు లేరు అనటం అతిశయోక్తి అస్సలు కాదు. జియో విషయంలో ఆయన ప్రస్థానం సైతం మనకు అదే రుజువు చేస్తోంది.
ప్రస్తుతం మనందరికీ తెలిసిందే రానున్నది ఎలక్ట్రిక్ వాహనాల యుగమని. దేశంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇప్పటికే అనేక ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఈ క్రమంలో అంబానీ అల్లుడు ఆనంద్ పిరమిల్ సంస్థ పిరమిల్ రియల్టీని అంబానీ తెరమీదకు తీసుకొచ్చారు. పిరమల్ రియాల్టీ 2012లో స్థాపించబడింది. ఇది ముంబై చుట్టుపక్కల రియల్టీ వ్యాపారాలను నిర్వహిస్తోంది.

చమురు వ్యాపారంలో ప్రపంచ దిగ్గజంగా ఉన్న రిలయన్స్ గ్రూప్ ఎలక్ట్రిక్ వాహనాలకు లాస్ట్ మైలేజ్ పరిష్కారాలను అందించేందుకు Jio-bp జాయింట్ వెంచర్ ను దేశ వ్యాప్తంగా ప్రారంభించింది. దీని ద్వారా ఈవీ వినియోగదారులకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ఈ రెండు కంపెనీలు జోడీ కట్టాయి. అయితే ఈ వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలని అంబానీ ప్లాన్ చేయటంతో అల్లుడు ఆనంద్ పిరమిల్ ను రంగంలోకి దింపారు.
ఆనంద్ పిరమిల్ ఆధ్వర్యంలోని పిరమిల్ రియల్టీకి అనేక చోట్ల రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలు ఉన్నాయి. ఈ ప్రాంగణాల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయటం ద్వారా ప్రీమియం కస్టమర్లకు, విజిటర్లకు సేవలను మరింత చేరువ చేయాలని అంబానీ నిర్ణయించారు. దీనికోసం Piramal Realty, Jio-bp జాయింట్ వెంచర్ ఇప్పుడు జోడీ కట్టాయి. దీనికోసం సంయుక్తంగా Jio-bp pulse mobile appను ఇందుకు వినియోగించనున్నారు. ఇందులో భాగంగా మొదటి సెట్ EV ఛార్జింగ్ పాయింట్లు థానేలోని పిరమల్ వైకుంఠంలో ఏర్పాటు చేయబడ్డాయి.

స్థిర ఛార్జింగ్ పాయింట్లతో పాటు, Jio-bp దాని బ్యాటరీ మార్పిడి స్టేషన్ల నెట్‌వర్క్ ద్వారా బ్యాటరీ స్వాపింగ్ సేవలను కూడా అందిస్తోంది. జియో-బిపి డిమాండ్ అగ్రిగేటర్‌లు, ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు, టెక్నాలజీ భాగస్వాములతో కలిసి దేశంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలవైపుకు మారేందుకు ఊతమివ్వడానికి కూడా పని చేస్తోంది. మెుత్తానికి మామ అల్లుళ్లు తమ నయా ప్లాన్ తో భవిష్యత్తు వ్యాపారానికి ముందు నుంచే బాటలు వేసుకున్నారని.. టాటాలకు పోటీగా ఈ రంగంలో ముందుకు సాగేందుకు దూకుడు ప్రయత్నాలను ఆచరణలోకి తెచ్చారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications