ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీలోకి ఇటీవల పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా గ్రోత్ ఈక్విటీ కంపెనీ జనరల్ అట్లాంటిక్ పార్ట్‌నర్స్ రూ.6,598.38 కోట్లు జియో ప్లాట్‌ఫాంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. ఈ ప్లాట్‌ఫాంలో గత నాలుగు వారాల్లోనే ఇది నాలుగో అతిపెద్ద పెట్టుబడి. ఈ నాలుగో అతిపెద్ద ఒప్పందం ద్వారా రూ.67,194.75 కోట్లు సమీకరించింది.

1.34 శాతం వాటా కొనుగోలు
జియోలో రూ.1.34 శాతం వాటా కొనుగోలుకు జనరల్ అట్లాంటిక్ సంస్థ ఈ మొత్తాన్ని చెల్లిస్తుంది. జనరల్ అట్లాంటిక్ సంస్థ ఆశియాలో పెట్టిన పెట్టుబడుల్లో ఇదే పెద్దది. ఇప్పటికే ఫేస్‌బుక్, సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ కంపెనీలు జియోలో ఇన్వెస్ట్ చేశాయి. ఇప్పుడు జనరల్ అట్లాంటిక్ నాలుగో అతిపెద్ద పెట్టుబడిని పెడుతోంది.

అంతర్జాతీయ కంపెనీలు రెడీ
దేశంలో డిజిటల్ సమాజం పెరుగుదలకు ఈ పెట్టుబడి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా షట్ డౌన్ కొనసాగుతోంది. కంపెనీలు అన్నీ అతలాకుతలం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో జియో ప్లాట్‌ఫామ్స్ వరుసగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. జియోలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. కొత్త పెట్టుబడుల ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఏఆర్, వీఆర్, బిగ్ డేటా అందజేయడం సులభమవుతుంది.

వరుసగా పెట్టుబడులు
గత నాలుగు వారాల్లో జియో ప్లాట్ ఫామ్స్‌లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. తొలుత జియో-ఫేస్‌బుక్ మధ్య రూ.43,574 కోట్ల డీల్ కుదిరింది. ఈ పెట్టుబడితో ఫేస్‌బుక్ 9.99 శాతం వాటాను దక్కించుకుంది. ఆ తర్వాత అమెరికా ప్రయివేటు ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్.. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1 శాతం వాటాను రూ.5,655 కోట్లకు కొనుగోలు చేసింది. అనంతరం విస్తా ఈక్విటీ రూ.11,367 కోట్ల విలువైన 2.3 శాతం వాటాను దక్కించుకుంది. ఇప్పుడు జనరల్ అట్లాంటిక్ పార్ట్‌నర్స్ రూ.6,598.38 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications