Jio recharge: మన జీవితాల్లో OTT ప్లాట్ ఫారమ్స్ ఇప్పుడు సర్వసాధారణమయ్యాయి. ఇది గమనించిన టెల్కోలు ఓవైపు ధరలు పెంచుతూనే, OTT బెనిఫిట్స్‌ను సైతం ఆఫర్ చేస్తున్నాయి. తద్వారా ఒకే మొబైల్ బిల్లుతో స్ట్రీమింగ్ కంటెంట్ ను సైతం చూసే అవకాశం యూజర్లకు లభిస్తోంది.
ఇప్పటివరకు ఈ తరహా ఆఫర్స్ కేవలం పోస్ట్ పెయిడ్ యూజర్లకు మాత్రమే సదరు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అందించేవారు. కాగా ప్రస్తుతం ఇండియాలో క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభం కావడంతో.. అంబానీకి చెందిన రిలయన్స్ జియో సరికొత్త విధానానికి తెరితీసింది. ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ తోనూ డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తోంది.

డిస్నీ+హాట్‌స్టార్‌తో కూడిన అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను జియో ఆవిష్కరించింది. ఈ క్రికెట్ సీజన్ లో తమ ప్రీపెయిడ్ వినియోగదారులను ఉత్సాహపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ప్లాన్‌లతో జియో సబ్‌స్క్రైబర్‌లు ఇతర ఎంటర్ టైన్‌మెంట్ కంటెంట్‌తో పాటు హై-డెఫినిషన్, బఫర్-లెస్ లైవ్ క్రికెట్ మ్యాచ్‌లను ఆస్వాదించవచ్చు.
సరసమైన 328, 388 ప్లాన్స్ తో 28 రోజులపాటు 1.5 GB, 2 GB చొప్పున వినియోగదారులు హై-స్పీడ్ డేటా సహా 3 నెలల డిస్నీ+హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. ఇతర ప్లాన్స్ 758, 808తో 84 రోజుల వ్యవధిలో 1.5 GB, 2 GB ఇంటర్నెట్ సహా 3 నెలల Disney+హాట్‌స్పార్ చూసే అవకాశం లభిస్తుంది.
ఇవికాక 84 రోజులు, వార్షిక వ్యాలిడిటీతో కూడిన 598, 3178 ప్రీమియం ప్లాన్స్ యూజర్లకు ఏకంగా ఏడాదిపాటు డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ను జియో అందిస్తోంది. ఈ బెనిఫిట్స్ పొందేందుకు వినియోగదారులు డిస్నీ+హాట్‌స్టార్ తో కూడిన ఏదైనా ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుని అదే నంబర్ ఉపయోగించి Disney+Hotstar యాప్ లో సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications