కరోనా వైరస్‌పై జియో ఉచిత కాలర్ ట్యూన్, మిగతా టెల్కోలు కూడా..
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. కరోనాపై ప్రజల్లో నెలకొన్న భయాలు తొలగించి అవగాహన కల్పించేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. ఇందులో భాగంగా రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ సంస్థలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. ఇందుకు ఉచిత కాలర్ ట్యూన్‌ను రూపొందించింది. ఇది శనివారం నుండి అమలులోకి వచ్చింది.
ఏ నెట్ వర్క్ నుండి అయినా జియోకు కాల్ చేస్తే ఈ ఉచిత కాలర్ ట్యూన్ వస్తుంది. కరోనాకు సంబంధించి ఆరోగ్య సలహాలు, సూచనలతో పాటు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కరోనాకు సంబంధించి తాజా సమాచారం అందిస్తారు. హెల్ప్ లైన్ నెంబర్లను కూడా తెలుసుకోవచ్చు. కరోనా బాధితులతో పాటు ఇతరులకు ఉపయోగపడే సమాచారాన్ని ఇందులో పొందుపరిచారు.

ఈ ఆటోమేటిక్ కాలర్ ట్యూన్‌ను జియో సహా ఏ టెల్కో కస్టమర్లకైనా ఉచితం. కేంద్ర ప్రభుత్వం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేపట్టిన అవగాహన చర్యల్లో భాగంగా ఉచిత కాలర్ ట్యూన్ అవగాహన సందేశం ప్రారంభమైంది.
మీరు నోవెల్ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆపవచ్చు. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మీ ముఖానికి కర్చీఫ్ అడ్డు పెట్టుకోండి. సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోండి. ముఖం, కల్లు లేదా ముక్కును తాకవద్దు. ఎవరికైనా దగ్గు, జ్వరం లేదా ఊపిరి కష్టంగా ఉంటే వారి నుండి కొంత దూరం ఉండాలి. అవసరమైతే వెంటనే సమీప హెల్త్ సెంటర్‌కు వెళ్లాలి అని హిందీ, ఇంగ్లీష్‌లో సందేశం వినిపిస్తుంది.


Click it and Unblock the Notifications