అపరిమిత వేగం.. అన్‌లిమిటెడ్ డేటా! తెలుగు రాష్ట్రాల్లో టాప్ నెట్‌వర్క్ ఇదే!
ఒకప్పుడు నెలకు 1 GB డేటా వాడుతుంటేనే చాలా ఎక్కువ అనుకునే వాళ్లం. కానీ ఇప్పుడు రోజుకు 2 GB వాడినా సరిపోవట్లేదు! దీనికి ప్రధాన కారణం కేవలం జియో(Jio 5G). అప్పట్లో జియో ఉచిత డేటాతో ఎంట్రి ఇచ్చినప్పటి నుంచి అందరూ ఇంటర్నెట్ కు బాగా అలవాటు పడ్డారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొబైల్ డేటా వినియోగం మునుపెన్నడూ లేని రీతిలో పెరిగిపోతోంది. ఈ డిజిటల్ విప్లవంలో రిలయన్స్ జియో రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేస్తోంది.

మొబైల్ డేటా వాడకం ఇలా..
తాజా లెక్కల ప్రకారం.. 2025 సెప్టెంబర్ త్రైమాసికానికి జియో వినియోగదారుల సగటు డేటా వినియోగం నెలకు ఏకంగా 38.7 GB కి చేరింది. గత ఏడాది ఇదే సమయానికి ఇది 31 GB మాత్రమే ఉండేది. అంటే ఎంత వేగంగా మనం ఇంటర్నెట్‌కు అలవాటు పడుతున్నామో అర్థం చేసుకోవచ్చు. ఇతర కంపెనీల యూజర్లు నెలకు 15 నుంచి 28 GB వాడుతుంటే, జియో యూజర్లు మాత్రం సగటున రోజుకు సుమారు 1 GB పైనే డేటాను ఖర్చు చేస్తున్నారు.
5G లో జియో రికార్డు
ఓపెన్‌సిగ్నల్ (OpenSignal) రిపోర్ట్ ప్రకారం, 5G నెట్‌వర్క్ కవరేజ్, స్థిరత్వంలో జియో అందరికంటే ముందుంది. జియో యొక్క 5G నెట్‌వర్క్ దాదాపు 70% మేర అందుబాటులోకి వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, జియో యూజర్లు తమ ఫోన్ వాడే సమయంలో 67.3% భాగం 5G నెట్‌వర్క్ లోనే గడుపుతున్నారు. దీనికి కారణం జియో ఉపయోగిస్తున్న 'స్టాండ్ అలోన్ 5G' (Standalone 5G) టెక్నాలజీ. ఇది సిగ్నల్ కట్ అవ్వకుండా నిరంతరాయంగా హై-స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తుంది.
ఏపీ, తెలంగాణలో జియో జోరు!
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) గణాంకాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టెలికాం సర్కిల్‌లో జియో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. 2025 నవంబర్ నెలలో జియో సుమారు 1.17 లక్షల కొత్త మొబైల్ వినియోగదారులను చేర్చుకుంది. దీనితో ఈ రెండు రాష్ట్రాల్లో జియో యూజర్ల సంఖ్య 3.18 కోట్లకు చేరుకుంది. కేవలం మొబైల్ డేటా మాత్రమే కాదు.. ఇంటింటికీ ఇంటర్నెట్ ఇచ్చే వైర్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో కూడా నెలకు 50,000 కొత్త కనెక్షన్లతో దూసుకుపోతోంది.
గ్రామాల్లోనూ 5G హంగామా
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి మెట్రో నగరాల్లోనే కాదు.. ఇప్పుడు టైర్-2, టైర్-3 పట్టణాల్లో కూడా జియో (Jio 5G) సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. క్లౌడ్ గేమింగ్, 4K వీడియో స్ట్రీమింగ్, ఆన్‌లైన్ క్లాసులు, వీడియో కాన్ఫరెన్సుల వల్ల డేటా వినియోగం భారీగా పెరిగింది. జియో ఎయిర్‌ఫైబర్ (AirFiber) సేవలు అందుబాటులోకి రావడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు వందల గిగాబైట్ల డేటాను అనాయాసంగా వాడేస్తున్నారు.
డిజిటల్ ఏపీ & తెలంగాణ
ప్రస్తుతం జియో నెట్‌వర్క్‌లో జరుగుతున్న మొత్తం డేటా ట్రాఫిక్‌లో 45% కేవలం 5G ద్వారానే జరుగుతోంది. వేగవంతమైన కనెక్టివిటీ, అన్‌లిమిటెడ్ 5G ప్లాన్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.
ఏదేమైనా టెక్నాలజీ పరంగా తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అగ్రగామిగా నిలవడానికి జియో అందిస్తున్న ఈ సేవలు ఎంతగానో దోహదపడుతున్నాయి. ఈ స్థాయిలో డేటా వాడకాన్ని చూస్తుంటే.. భవిష్యత్తులో రోజుకి 2 జీబీ, 3 జీబీ కూడా సరిపోని రోజులు వస్తాయేమో!


Click it and Unblock the Notifications