Jindal Worldwide Bonus: మరికొద్ది రోజుల్లో దేశీయ స్టాక్ మార్కెట్లలో కార్పొరేట్ లిస్టెడ్ కంపెనీలు తమ మూడు త్రైమాసిక ఫలితాలను ప్రకటించటానికి సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది చూరుకుగా ఉండే ట్రేడర్లు అవి అందించే బోనస్ షేర్లు, డివిడెండ్లను అందిపుచ్చుకునేందుకు ఆసక్తిగా ట్రేడింగ్ ప్లాన్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలో జిందాల్ గ్రూప్ కంపెనీ అయిన జిందాల్ వరల్డ్‌వైడ్ లిమిటెడ్ తన పెట్టుబడిదారులకు పెద్ద శుభవార్తను ప్రకటించింది. సంక్రాంతికి మరో వారం రోజులు మిగిలి ఉండగానే కంపెనీ ఇన్వెస్టర్లకు పెద్ద బహుమతిని ప్రకటించింది. పెట్టుబడిదారులకు 4:1 రేషియోలో బోనస్ షేర్లను అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ఈవార్తలో ఇంట్రాడేలో స్మాల్ క్యాప్ కంపెనీ షేర్లు దాదాపు 5 శాతానికి పైగా లాభపడ్డాయి. ఈ క్రమంలో కంపెనీ షేర్లు తమ 52 వారాల గరిష్ఠ ధర రూ.463.9ని తాకాయి. దీంతో గడచిన ఏడాది కాలంలో కంపెనీ షేర్లు తమ ఇన్వెస్టర్లకు 47 శాతానికి పైగా భారీ రాబడిని అందించింది.

కంపెనీ ఉచితంగా అర్హులైన ఇన్వెస్టర్లకు షేర్లను భారీగానే ఇస్తోంది. ఇన్వెస్టర్లు హోల్డ్ చేస్తున్న ప్రతి షేరుకు అదనంగా 4 షేర్లను అందించాలని ప్రస్తుతం నిర్ణయించింది. ఈనెల 7న జరిగిన బోర్డు మీటింగ్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకోబడింది. దీనికి సంబంధించి రికార్డు తేదీని త్వరలోనే ప్రత్యేకంగా ప్రకటిస్తామని పేర్కొంది. అలాగే అర్హులైన పెట్టుబడిదారుల డీమ్యాట్ ఖాతాల్లో బోనస్ షేర్లను మార్చి 6, 2025 నాటికి జమ చేయబడతాయని పేర్కొంది. దీనికోసం అర్హత పొందాలని భావించే ఇన్వెస్టర్లు త్వరలో కంపెనీ ప్రకటించే రికార్డు తేదీ నాటికి వారి డీమ్యాట్ ఖాతాలో షేర్లను కలిగి ఉండి కంపెనీ పుస్తకాల్లో షేర్ హోల్డర్ గా ఉండాల్సి ఉంటుంది.
వాస్తవానికి జిందాల్ వరల్డ్‌వైడ్ లిమిటెడ్ రూ.18,000 కోట్ల బీసీ జిందాల్ గ్రూప్‌లో భాగం. కంపెనీకి పశ్చిమ బెంగాల్‌లో రెండు ఫ్యాక్టరీలను కలిగి ఉంది. ఇది లాటిన్ అమెరికా సహా అనేక ఇతర దేశాలకు ఉక్కు ఉత్పత్తుల ఎగుమతిలో పనిచేస్తోంది. ఏడాది కాలంలో సెన్సెక్స్ సూచీ కంటే 5 రెట్లు అధిక రాబడిని అందించిన కంపెనీ దీర్ఘకాలికంగా కూడా ఉత్తమ రాబడిని ఇన్వెస్టర్లకు అందించింది. ఐదేళ్ల కాలంలో కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు దాదాపు 650 శాతం రాబడిని అందించాయి. జనవరి 2020లో రూ.62.70 వద్ద ఉన్న స్టాక్ ధర నేడు రూ.471 స్థాయికి ఈ క్రమంలో చేరుకుంది.
ఇదే క్రమంలో 10 ఏళ్ల కాలంలో స్టాక్ పెట్టుబడిదారులకు 4000 శాతం రాబడిని తెచ్చిపెట్టింది. 2015 జనవరిలో స్టాక్ ధర ఒక్కోటి రూ.11.14 వద్ద ఉండగా ప్రస్తుతం రూ.471కి పెరిగింది. గడచిన రెండు నెలల్లో స్టాక్ మంచి బులిష్ పనితీరుతో 55 శాతానికి పైగా పెరుగుదలను చూసింది. మధ్యాహ్నం 1.57 గంటల సమయంలో కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.446.65 వద్ద ఎన్ఎస్ఈలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. కంపెనీ ఉత్తమ పనితీరు కారణంగా తన ఇన్వెస్టర్లను బోనస్ షేర్లతో రివార్డ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications