Multibagger Stock: ప్రపంచ వ్యాప్తంగా నిర్మాణ రంగం వృద్ధి చెందటంతో స్టీల్ స్టాక్స్ గత కొంత కాలంగా తమ ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందిస్తున్నాయి. తక్కువ కాలంలోనే బలమైన రాబడులను తెచ్చిపెడుతున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది జిందాల్ సా లిమిటెడ్ కంపెనీ గురించే. ఈ కంపెనీ గత మూడేళ్ల కాలంలో ఇన్వెస్టర్లకు 300 శాతానికి పైగా రాబడులను అందించింది. ఈ సంస్థ ఐరన్ అండ్ స్టీల్ పైపుల ఉత్పత్తిలో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం దీర్ఘకాల ఇన్వెస్టర్లు షేర్ల ధర పెరుగుదలతో మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.

ఈ కంపెనీ షేర్ ధర జూన్ 29, 2020న రూ.58.2 వద్ద ఉంది. అయితే జూలై 3, 2023న స్టాక్ ధర రూ.268.30 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో స్టాక్ నేడు 4.77 శాతం మేర లాభపడింది. నేడు స్టాక్ తన 52 వారాల గరిష్ఠం రూ.268.65 వద్ద ఉండగా.. స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.77.15గా ఉంది. మూడేళ్ల కాలంలో కంపెనీ షేర్లు 345 శాతానికి పైగా రాబడులను అందించాయి.
ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీ షేర్లలో మూడేళ్ల కిందట రూ.58.2 వద్ద లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే.. పెట్టుబడి విలువ రూ.4.8 లక్షలకు చేరుకుని ఉండేది. అందుకే సరైన ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలో పెట్టుబడులను దీర్ఙకాలం కొనసాగించాలని పెద్ద ఇన్వెస్టర్లు చెబుతుంటారు. స్టీల్ ఇండస్ట్రీకి చెందిన స్టాక్ ఏడాది కాలంలో 222 శాతం లాభపడింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.8,490 కోట్లుగా ఉంది.

ప్రస్తుతం ఈ కంపెనీ స్టాక్ బలమైన అప్‌ట్రెండ్‌లో ఉందని బ్రోకరేజ్ సంస్థ ప్రభుదాస్ లిల్లాధర్ వెల్లడించింది. సమీప కాలంలో స్టాక్ ధర రూ.290-295 స్థాయికి చేరుకుంటుందని అంచనా వేశారు. ఇదే క్రమంలో ఎస్బీఐ సెక్యూరిటీస్ కంపెనీ షేర్లకు రూ.301 టార్గెట్ ధరగా వెల్లడించింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం గతంలో కంటే 178 శాతం పెరిగి రూ.353.68 కోట్లకు చేరుకుంది. అలాగే విక్రయాలు 34.16% పెరిగి రూ.18,046 కోట్లకు చేరుకున్నాయి.


Click it and Unblock the Notifications