Go First: నగదు కొరతతో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా దేశీయ బడ్జెట్ విమానయాన సంస్థ గోఫస్ట్ తన సేవలను నిలిపివేసింది. వాడియా గ్రూప్ యాజమాన్యంలో నడుస్తున్న కంపెనీ మే 3, 2023 నుంచి గ్రౌండ్ అయ్యింది.
ఈ క్రమంలోనే ఎయిర్ లైన్ స్వచ్చందంగా దివాలాకు దాఖలు చేసింది. తాము కంపెనీని నడపటంపై నిబద్ధతతో ముందుకు సాగుతున్నామని.. త్వరలోనే సేవలను పునరుద్ధరిస్తామని కంపెనీ గతంలో ప్రకటించింది. అయితే సేవలను రివైవ్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కాలేదని చెప్పుకోవాలి. దీంతో కంపెనీలో పనిచేస్తున్న చాలా మంది సిబ్బంది ఇతర ఏవియేషన్ సంస్థల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో మూతపడిన భారతీయ విమానయాన సంస్థ గో ఫస్ట్ కొనుగోలు రేసులో జిందాల్ పవర్ లిమిటెడ్ ప్రస్తుతం ముందంజలో ఉంది. జిందాల్ పవర్ ఎయిర్‌లైన్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి వ్యక్తీకరణ(EOI) సమర్పించింది. EOI అనేది బిడ్డింగ్ ప్రక్రియలో మొదటి దశ. దీని ద్వారా దివాలా తీసిన కంపెనీని ఏ కంపెనీలు లేదా ఇన్వెస్టర్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారో తెలుస్తుంది. "బ్యాంకులు ఆసక్తి వ్యక్తీకరణను ఆమోదించిన ఏకైక విజయవంతమైన దరఖాస్తుదారు జిందాల్ పవర్" అని సమాచారం. అయితే కంపెనీని కొనుగోలు చేసే రేసులో రెండు విదేశీ సంస్థలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
గోఫస్ట్ అకస్మాత్తుగా తన సేవలను నిలిపివేస్తున్నట్లు మే 3న వెల్లడించిన తర్వాత కంపెనీ NCLTని సంప్రదించింది. ఆ తర్వాత వ్యాపారంలో వచ్చిన గ్యాప్‌ను రాకేష్ జున్‌జున్‌వాలా సంస్థ ఆకాశ క్యాష్ చేసువోవాలని చూసింది. అయితే ఏకకాలంలో 40 మందికి పైగా పైలట్లు రాజీనామా చేయటంతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించింది. ఇదే సమయంలో ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన టాటాలు మాత్రం వేగంగా తమ విస్తరణను కొనసాగిస్తున్నారు.


Click it and Unblock the Notifications