Electoral Bonds: దేశంలో ఇటీవల ఎలక్టోరల్ బాండ్ల డేటాను అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు బహిర్గతం చేయటం సంచలనంగా మారింది. రాజకీయ పార్టీలకు వ్యాపార సంస్థలు అందిస్తున్న విరాళాల వివరాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త నవీన్ జిందాల్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో హర్యానాలో కాంగ్రెస్ కు గట్టి దెబ్బ తగిలిందనే చెప్పుకోవచ్చు. నవీన్ జిందాల్ 2004 నుంచి 2009 వరకు, 2009 నుంచి 2014 వరకు వరుసగా రెండు సార్లు కురుక్షేత్ర నుంచి ఎంపీగా ఎన్నికయ్యార. ఆయన జిందాల్ స్టీల్ అండ్ పవర్ ప్రమోటర్ కూడా. ఇటీవల ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తున్న కంపెనీల జాబితాలో జిందాల్ గ్రూప్‌కు చెందిన పలు కంపెనీల పేర్లు బహిర్గతమయ్యాయి.

సుప్రీంకోర్టు సూచనల మేరకు ఎస్‌బీఐ ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన సమాచారం ప్రకారం జిందాల్ గ్రూపునకు చెందిన చాలా కంపెనీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు అందించాయి. వీటిలో జిందాల్ సా లిమిటెడ్, జిందాల్ స్టెయిన్‌లెస్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ ఉన్నాయి. బొగ్గు క్షేత్రాల కేటాయింపు కేసులో జిందాల్ స్టీల్ అండ్ పవర్ ప్రమోటర్ నవీన్ జిందాల్‌పై ఏప్రిల్ 2022లో ఈడీ దాడులు చేసింది.
దీని తర్వాత కంపెనీ మొదటి ఎలక్టోరల్ బాండ్‌ను అక్టోబర్ 2022లో కొనుగోలు చేసింది. కంపెనీ మొత్తం రూ.123 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయగాయ.. వీటిలో ఒడిశాలోని అధికార పార్టీ బీజేడీకి రూ.100 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.20 కోట్లు, బీజేపీకి రూ.3 కోట్లు వెళ్లాయి. ఇతర జిందాల్ గ్రూప్ కంపెనీలు ఏప్రిల్ 2019 నుంచి బీజేపీకి మెుత్తంగా రూ.72.5 కోట్లను విరాళంగా అందించాయి.
నవీన్ జిందాల్ 9 మార్చి 1970న జన్మించారు. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ చైర్మన్‌తో పాటు, ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్‌గా నవీన్ అన్న సజ్జన్ జిందాల్ ఉన్నారు. అతని తల్లి సావిత్రి జిందాల్ భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళగా రికార్డు సృష్టించారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన 56వ స్థానంలో ఉన్నారు. ఆమె భర్త ఓం ప్రకాష్ జిందాల్ స్థాపించిన OP జిందాల్ గ్రూప్‌ను నియంత్రిస్తుంది. గ్రూప్ మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి, ఇండస్ట్రియల్ గ్యాసెస్, ఓడరేవులకు విస్తరించింది. జిందాల్ కుటుంబానికి దిల్లీలో రూ.150 కోట్లు విలువైన బంగ్లా కూడా ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications