Federal Bank Stock: దివంగత రాకేష్ జున్‌జున్‌వాలా ప్రస్తుతం లేకపోయినా ఆయన పెట్టుబడులను మాత్రం అనేక మంది అనుకరిస్తూనే ఉన్నారు. స్టాక్ మార్కెట్ల భారీ పెరుగుదల సమయంలో నేడు ఆయన స్టాక్స్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలోని ఫెడరల్ బ్యాంక్ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో స్థూల అడ్వాన్సులు 20 శాతం పెరిగి రూ.1,77,377 కోట్ల నుంచి రూ.2,12,758 కోట్లకు చేరుకున్నాయని ప్రకటించింది. మార్చి 31, 2023 నాటికి మొత్తం డిపాజిట్లు రూ.2,52,583 కోట్లకు చేరుకుని ఏడాది ప్రాతిపదికన 18 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో జమ చేసిన మొత్తం రూ.2,13,386 కోట్లుగా ఉంది. ఇది కాకుండా బ్యాంకు రిటైల్ క్రెడిట్ బుక్ 25 శాతం పెరిగింది. హోల్‌సేల్ క్రెడిట్ బుక్ 15 శాతం పెరిగింది. అలాగే రిటైల్ అండ్ హోల్‌సేల్ నిష్పత్తి 56:44 వద్ద ఉంది.

ఫెడరల్ బ్యాంక్ షేర్లను ట్రాక్ చేస్తున్న బ్రోకరేజ్ సంస్థలు ఈ వ్యాపార నవీకరణను దృష్టిలో ఉంచుకుని స్టాక్‌పై భిన్నమైన అభిప్రాయాలను తెలియజేస్తున్నాయి. కొందరు బ్యాంక్ స్టాక్‌లో దాదాపు 15 శాతం పెరిగే అవకాశం ఉందని, మరికొందరు స్టాక్‌లో 21 శాతం క్షీణత గురించి భయపడుతున్నారు. సిటీ ఫెడరల్ బ్యాంక్‌కి షేరుకు రూ.135 టార్గెట్‌తో 'SELL' రేటింగ్ ఇచ్చింది. అయితే CASA మాత్రం టార్గెట్ ధర రూ.165గా తెలిపింది. బలమైన రుణం & డిపాజిట్ వృద్ధి ఆధారంగా ఫెడరల్ బ్యాంక్‌పై నోమురా సానుకూలంగా ఉంది. గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ రూ.190 టార్గెట్ ధరతో స్టాక్‌పై BUY రేటింగ్‌ను కొనసాగిస్తోంది.
ఈ కంపెనీ షేర్లు అంటే ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలాకు ఎంతో ఇష్టం. అయితే డిసెంబర్ 2023 నాటికి కంపెనీ ఆయన భార్య రేఖా జున్‌జున్‌వాలాకు ప్రైవేట్ సెక్టార్ ఫెడరల్ బ్యాంక్‌లో 7,27,13,440 ఈక్విటీ షేర్లు లేదా 3.02 శాతం వాటాను హోల్డ్ చేస్తున్నారు. దీని ప్రస్తుత విలువ దాదాపు రూ.1,125 కోట్లకు సమానం.


Click it and Unblock the Notifications