Rekha Jhunjhunwala: స్టాక్ మార్కెట్ అనే మహా సముద్రంలో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లకు పరిచయం ఉన్న ప్రముఖ పెట్టుబడిదారు దివంగ బిగ్ బుల్ రాకేష్ జున్‌జున్‌వాలా అనేక మందికి మార్గదర్శకంగా నిలిచారు. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుందని ఇండియా గ్రోత్ స్టోరీపై ముందు నుంచి బలమైన నమ్మకంతో ఉన్న వారిలో రాకేష్ కూడా ఒకరు. అందుకే ఆయన పోర్ట్ ఫోలియోకు క్రేజ్ ఎక్కువ.
వాస్తవానికి జున్‌జున్‌వాలా ఫ్యామిలీ దశను మార్చిన వారిలో టాటాలది కీలక పాత్ర. ఎందుకంటే టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీ అయిన టైటాన్ రాకేష్ జున్‌జున్‌వాలాకు దశాబ్ధకాలానికి పైగా అంతులేని లాభాలను తెచ్చిపెట్టింది. అయితే తాజాగా టాటా గ్రూప్ కంపెనీ టైటాన్ షేర్లు 18 నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. నేడు బీఎస్ఈలో టైటాన్ షేర్లు 2 శాతం కంటే ఎక్కువ క్షీణించి రూ.3018కి చేరుకున్నాయి. దీంతో స్టాక్ తన 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. దీంతో 2023 ఆగస్టు తర్వాత టైటాన్ షేర్లు ప్రస్తుతం అత్యల్ప స్థాయికి చేరుకోవటం గమనార్హం.

అయితే గడచిన నెలలో దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం కారణంగా టైటాన్ స్టాక్ భారీ క్షీణతను చూసింది. దీని కారణంగా జున్‌జున్‌వాలా కుటుంబ నిలక విలువ రూ.2,500 కోట్లు ఆవిరైందని వెల్లడైంది. గత నెలలో టైటాన్ స్టాక్ దాదాపు 17 శాతం పడిపోవటమే ఈ భారీ పతనానికి కారణంగా చెప్పబడుతోంది. ఒక్క నెల కాలంలో స్టాక్ రూ.3600 స్థాయి నుంచి రూ.3018కి దిగజారింది. అంటే దాదాపు ఒక్కో షేరు విలువ రూ.580 వరకు క్షీణించింది. ప్రస్తుతం మార్కెట్లు ట్రంప్ టారిఫ్ యుద్ధం నేపథ్యంలో మరింత క్షీణతను చూస్తుండగా పరిస్థితులు దిగజారుతున్నాయని ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జున్‌జున్‌వాలా కుటుంబానికి అత్యంత ఇష్టమైన షేర్లలో ఒకటైన టైటాన్ పై వారు చాలా పెద్ద స్థాయిలో పందెం వేసిన సంగతి తెలిసిందే. దీంతో రేఖా ప్రస్తుతం 95 లక్షలకు పైగా షేర్లను ఈ కంపెనీలో హోల్డ్ చేస్తున్నారని వెల్లడైంది. అలాగే దివంగత రాకేష్ జున్‌జున్‌వాలా ఎస్టేట్ పేరుతో మరో 3,61,72,895 షేర్లు ఉన్నాయి. అంటే ఈ రెండు కేటగిరీల కింద 45,713,470 షేర్లను కలిగి ఉండటంతో ఒక్కో షేరు విలువ రూ.581 తగ్గటంతో రూ.2,600 కోట్ల భారీ నష్టాన్ని జున్‌జున్‌వాలా ఫ్యామిలీ చవిచూసింది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications