Bonus Shares: టాటా గ్రూప్‌కు చెందిన టైటాన్ ఇటీవల క్యారట్‌లేన్ అనే జ్యువెలరీ స్టార్టప్‌లో మెుత్తం వాటాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. దీని తర్వాత స్టార్టప్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది.
తన దగ్గర పనిచేస్తున్న స్టార్టప్ ఉద్యోగులకు స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ రూపంలో రూ.340 కోట్ల నుంచి రూ.380 కోట్ల వరకు అందుకోవచ్చని అంచనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం CaratLane కంపెనీ దాదాపు 15,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. తయారీ, రిటైల్ విభాగాలలో ఎక్కువ మంది పని చేస్తున్నారు. వీరు షేర్లకు బదులుగా బోనస్‌లు, ప్రమోషన్‌లను అందుకుంటారు.

అందువల్ల కార్పొరేట్ బృందంలో ఉన్న దాదాపు 400 మంది ఉద్యోగులు ఉండగా.. వీరిలో 75 మంది స్టార్టప్‌లో వాటాలు కలిగి ఉన్నారు. ప్రస్తుతం వాటి విలువ రూ.340-రూ.380 కోట్ల మధ్య లేదా కంపెనీలో దాదాపు 1.72 శాతం. క్యారట్‌లేన్ ఉద్యోగుల వాటాలను టాటాలకు చెందిన టైటాన్ కొనుగోలు చేస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే కంపెనీలో టైటాన్ తన వాటాలను పెంచుకుంటోంది. దీంతో ప్రస్తుతం క్యారట్‌లేన్‌లో 71.09 శాతం వాటాను కలిగి ఉంది. మిగిలిన 27.18 శాతం వాటాను కంపెనీ వ్యవస్థాపకుడు, CEO మిథున్ సంశెట్టి, ఆయన కుటుంబం నుంచి కొనుగోకు రూ.4,621 కోట్లను చెల్లించేందుకు సిద్ధంగా ఉంది.
నియంత్రణ సంస్థల ఆమోదం పొందిన తర్వాత అక్టోబర్ 31, 2023 నాటికి కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈఎస్ఓపీ కాంపోనెంట్ కూడా అక్టోబర్ చివరి నాటికి అదే సమయంలో కొనుగోలు చేయబడుతుందని తెలుస్తోంది. టాటా గ్రూప్ సంస్థ టైటాన్ కో లిమిటెడ్ మొదట జులై 14, 2023న క్యారట్‌లేన్‌లో 62 శాతం వాటాను రూ.357.24 కోట్లకు కొనుగోలు చేసింది. ఆన్‌లైన్ జ్యువెలరీ మార్కెట్‌లో క్యారట్‌లేన్ ఒక ప్రసిద్ధ బ్రాండ్ కావటంతో టాటా గ్రూప్ దీనిని కొనుగోలు చేస్తోంది. ఇది విభిన్నమైన ఖాతాదారులకు సేవలందిస్తూ.. డిజైన్, తయారీ, సాంకేతికత, ఈ-కామర్స్‌లో బలమైన అంతర్గత సామర్థ్యాలను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications