Gold: మీరు గమనించారా? మోహన్ లాల్, అభిషేక్ శర్మ బంగారు నగలు ఎందుకు ధరిస్తున్నారు?

భారతీయ జ్యువెలరీ రంగంలో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. ఇప్పటి వరకు కేవలం మహిళలకే పరిమితమైన ఆభరణాల మార్కెట్.. ఇప్పుడు పురుషులు, పిల్లల వైపు మొగ్గు చూపుతోంది. ప్రముఖ ఆభరణాల సంస్థలు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఈ కొత్త విభాగాలను (Categories) ఎంచుకుంటున్నాయి. బంగారం ధరలు (Gold Prices) ఆకాశాన్ని తాకుతున్నా, వినియోగదారుల కొనుగోలు శక్తిని పెంచేందుకు బ్రాండ్లు తమ మార్కెటింగ్ శైలిని పూర్తిగా మార్చేస్తున్నాయి.

భారతీయ సంస్కృతిలో బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్. అలాగే ఒక సురక్షితమైన పెట్టుబడి కూడా. అయితే దశాబ్దాలుగా కేవలం మహిళలకే పరిమితమైన ఈ బంగారం (Gold) మార్కెట్, ఇప్పుడు అనూహ్యమైన మలుపు తిరుగుతోంది. మారుతున్న కాలంతో పాటు పురుషులు మరియు పిల్లల అభిరుచులకు అనుగుణంగా జ్యువెలరీ దిగ్గజాలు తమ వ్యూహాలను మారుస్తూ, సరికొత్త డిమాండ్‌ను సృష్టిస్తున్నాయి. ఈ విప్లవాత్మక మార్పు వెనుక ఉన్న అసలు కారణాలు, మార్కెట్ ట్రెండ్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

Jewellery Retailers Expand Into Men and Kids Categories To Unlock New Demand and Gold Market Growth

మారుతున్న ప్రకటనల తీరు

ఒకప్పుడు కేవలం మహిళలే ఆభరణాల ప్రకటనల్లో కనిపించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక జ్యువెలరీ బ్రాండ్ ప్రకటనలో స్వయంగా ఆభరణాలు ధరించి కనిపించడం ఒక గొప్ప మార్పుకు సంకేతం. గతంలో పురుషులు కేవలం గిఫ్ట్ ఇచ్చే తండ్రిగానో, అన్నయ్యగానో ఉండేవారు. కానీ ఇప్పుడు వారు నేరుగా వినియోగదారులుగా మారుతున్నారు. అదేవిధంగా క్రికెటర్ అభిషేక్ శర్మ వంటి యువ తారలు డైమండ్ బ్రాండ్లకు అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.

యువత , జెన్-జెడ్ అభిరుచులు

కళ్యాణ్ జ్యువెలర్స్ వంటి దిగ్గజ సంస్థల విశ్లేషణ ప్రకారం, నేటి యువత (Gen Z) , మిలీనియల్స్ భారీ ఆభరణాల కంటే తేలికపాటి, ట్రెండీ , మినిమలిస్ట్ డిజైన్లను ఇష్టపడుతున్నారు. ప్రతిరోజూ ఆఫీసులకు లేదా పార్టీలకు ధరించేలా ఉండే లైట్ వెయిట్ గోల్డ్ (Gold) జ్యువెలరీకి డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు, మధ్యవయస్కులు డిజైన్లతో పాటు పెట్టుబడి విలువ (Investment Value) ఉండే ఆభరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఆర్థిక శక్తిగా మారుతున్న పెద్దలు

రెడ్‌సీర్ (Redseer) నివేదిక ప్రకారం, 45-60 ఏళ్ల మధ్య వయస్సు గలవారు (Gen X) 2030 ఆర్థిక సంవత్సరం నాటికి దాదాపు 500 బిలియన్ డాలర్ల వినియోగానికి కారణం కానున్నారు. వీరికి ఆర్థిక స్థిరత్వం ఎక్కువగా ఉండటంతో ప్రీమియం ఆభరణాల కొనుగోలులో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే బ్రాండ్లు ఇప్పుడు కేవలం యువతనే కాకుండా జీనత్ అమన్, నీనా గుప్తా వంటి సీనియర్ నటీమణులను కూడా తమ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుంటూ అన్ని వయసుల వారిని ఆకట్టుకుంటున్నాయి.

ఏదేమైనా జ్యువెలరీ మార్కెట్ ఇప్పుడు కేవలం పెళ్లిళ్లకే పరిమితం కాకుండా ఒక జీవనశైలిగా మారుతోంది. పురుషుల కోసం ప్రత్యేకమైన బ్రాస్లెట్లు, గొలుసులు , పిల్లల కోసం చిన్నపాటి ఆభరణాలను పరిచయం చేయడం ద్వారా కంపెనీలు తమ విక్రయాలను పెంచుకుంటున్నాయి. బంగారం (Gold) పట్ల భారతీయులకున్న మక్కువను క్యాష్ చేసుకునేందుకు, ఈ కొత్త విభాగాల్లోకి ప్రవేశించడం ఒక తెలివైన వ్యాపార ఎత్తుగడగా కనిపిస్తోంది. భవిష్యత్తులో ఈ విభాగం మరింత వృద్ధి చెంది, మార్కెట్‌లో కీలక వాటాను దక్కించుకోవడం ఖాయం.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+