For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జూన్ నుండి బంగారు ఆభరణాల హాల్ మార్కింగ్ తప్పనిసరి!

|

బంగారు ఆభరణాల కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టార్డర్డ్స్(BIS) ప్రకారం జూన్ నెల నుండి 14KT, 18KT, 20KT, 22KT, 23KT and 24KT క్యారెట్ల బంగారు ఆభరణాల పైన హాల్ మార్కింగ్ తప్పనిసరి. ప్రతి జ్యువెల్లరీ వ్యాపారి ఒకటో తేదీ నుండి అన్ని బంగారు ఆభరణాలను కూడా హాల్ మార్కింగ్‌తో విక్రయించవలసి ఉంటుంది. క్యారెట్లతో సంబంధం లేకుండా అన్ని ఆభరణాలపై తప్పనిసరిగా హాల్ మార్కింగ్ ఉండాలి.

ఈ మేర‌కు బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్ట్స్ గ‌త నెల 4వ తేదీన నోటిఫికేష‌న్ జారీ చేసింది. 14 క్యారెట్లు, 18 క్యారెట్లు, 20 క్యారెట్లు, 22 క్యారెట్లు, 23 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారంపై హాల్ మార్కింగ్ ఉంటోంది. 21 క్యారెట్లు లేదా 19 క్యారెట్ల బంగారం ఆభ‌ర‌ణాల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు హాల్ మార్కింగ్ లేదు. అయితే జూన్ ఒకటవ తేదీ నుండి నిబంధ‌న‌లు మారుతున్నాయి.

Jewellery buyers to get purity hallmark on all types of gold articles from June 1

ఎవరైనా 12 క్యారెట్లు లేదా 16 క్యారెట్ల బంగారు ఆభ‌ర‌ణం కొనాలనుకున్నా జ్యువెల్ల‌రీ షాప్ య‌జ‌మాని తొలుత BIS హాల్ మార్కింగ్ సెంట‌ర్ నుండి హాల్ మార్కింగ్ చేసిన త‌ర్వాత విక్రయించాలని చెబుతున్నారు. బంగారు ఆభరణాల ప్యూరిటీ లక్షణాలను కేంద్రం సవరించింది. హాల్ మార్కింగ్ బంగారు ఆభరణాలపై మూడు గుర్తులు ఉంటాయి. వాటిలో ఒకటి బీఐఎస్ లోగో, ప్యూరిటీ లేదా ఫైనెస్ గ్రేడ్ ఆరంకెల అల్ఫాన్యూమరికల్ కోడ్ ఉంటాయి.

English summary

జూన్ నుండి బంగారు ఆభరణాల హాల్ మార్కింగ్ తప్పనిసరి! | Jewellery buyers to get purity hallmark on all types of gold articles from June 1

At present, as per the Bureau of Indian Standard's website, gold hallmarking is allowed for 6 purity categories, namely, 14KT, 18KT, 20KT, 22KT, 23KT and 24KT.
Story first published: Sunday, May 29, 2022, 9:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X