భారతదేశంలో జీఎస్టీ అమలు ప్రారంభమైన 2017 జూలై 1 నుండి ఇప్పటివరకు అనేక మార్పులు చోటు చేసుకున్న సంగతి విదితమే. తాజాగా జరిగిన 56వ సమావేశంలో కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు మరిన్ని కీలక మార్పులకు వేదికగా మారబోతున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ ప్రస్తుత నాలుగు శ్లాబ్‌ల (5%, 12%, 18%, 28%) బదులుగా కేవలం 5%, 18% రెండు శ్లాబ్‌ల నిర్మాణాన్ని ఆమోదించింది. హై-ఎండ్ కార్లు, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు వంటి విలాస వస్తువుల కోసం మాత్రమే ప్రత్యేకంగా 40% పన్ను రేటు ప్రవేశపెట్టారు. ఈ కొత్త GST రేట్లు రాబోయే సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి రానున్నాయి.
కొత్తగా వచ్చిన GST మార్పు అనేక గృహ వినియోగ వస్తువులను చౌకగా మార్చనుంది. ప్రజల నిత్యావసరాలైన ఆహార పదార్థాలు, మందులు, విద్యా సామగ్రి వంటి విభాగాల్లో పన్నులు తగ్గించడంతో వినియోగదారుల ఖర్చు కాస్త తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఈ GST మార్పును నిర్మాణాత్మక సంస్కరణగా అభివర్ణిస్తూ.. వ్యాపార వర్గాలు, వినియోగదారులకు ఇది పెద్ద ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు.

అయితే తాజాగా వచ్చిన జీఎస్టీ బంగారంపై ఏదైనా ప్రభావం చూపుతుందా అనేది మనం చూసినట్లయితే.. బంగారం, వెండి ఆభరణాలపై జీఎస్టీ రేట్లలో ఎటువంటి మార్పు జరగలేదు. బంగారం, వెండి ఆభరణాలపై ఇప్పటివరకు అమలులో ఉన్న 3 శాతం జీఎస్టీ అదే విధంగా కొనసాగుతుంది. అదనంగా బంగారం తయారీ ఖర్చులపై 5 శాతం పన్ను వసూలు ఉంటుంది. అంటే వినియోగదారులు ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో ఇప్పటివరకు ఉన్న పన్ను భారం యధాతథంగానే ఉంటుంది. ఇదే సమయంలో Gold నాణేలు, కడ్డీలు కూడా 3 శాతం జీఎస్టీ కింద కొనసాగుతాయి. కాబట్టి, జీఎస్టీ 2.0 సంస్కరణలు బులియన్ మార్కెట్ మీద ప్రత్యక్ష ప్రభావం చూపకపోవచ్చు.
భారీగా తగ్గిన బంగారం ధర.. మహిళలు వెంటనే ఆలోచన చేయండి.. సెప్టెంబర్ 4, గురువారం ధరలు ఇవే..
ఇక జీఎస్టీ రేట్ల కోతల ప్రభావంతో పెట్టుబడిదారుల దృష్టి రిస్క్ పెంచే ఆస్తుల వైపు మళ్లింది. దాంతో Gold ధరలు స్వల్ప ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బుధవారం ఉదయం 11:30 గంటల నాటికి, MCX గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ 1.1శాతం తగ్గి 10 గ్రాములకు రూ. 1,06,086 వద్ద ట్రేడ్ అయ్యాయి. రోజు గరిష్ట స్థాయి రూ. 1,06,774, కనిష్ట స్థాయి రూ. 1,05,800 మధ్య ఈ ఒడిదుడుకులు నమోదయ్యాయి. వెండి కూడా అదే ప్రభావాన్ని ఎదుర్కొంది. డిసెంబర్ డెలివరీకి సంబంధించిన MCX సిల్వర్ కాంట్రాక్ట్ 1.2 శాతం తగ్గి కిలోకు రూ. 1,24,277 వద్ద ట్రేడైంది.
ఇదే సమయంలో స్టాక్ మార్కెట్ మాత్రం జీఎస్టీ రేట్ల కోతలకు సానుకూలంగా స్పందించింది. ఉదయం 11:30 గంటల సమయంలో నిఫ్టీ 50 సూచీ 0.4 శాతం పెరిగి 24,822 వద్ద ఉండగా, సెన్సెక్స్ కూడా 0.4 శాతం పెరిగి 80,958 స్థాయికి చేరింది. రంగాల వారీగా చూస్తే, నిఫ్టీ ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, FMCG లాభాలను చూపగా.. ఐటీ, ఆయిల్ & గ్యాస్ సూచీలు మాత్రం కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అయ్యాయి.
జీఎస్టీ 2.0 సంస్కరణలు సాధారణ వినియోగదారులకు ఉపశమనం ఇచ్చేలా ఉన్నప్పటికీ, బంగారం, వెండి ఆభరణాలపై ఎటువంటి పన్ను తగ్గింపు రాకపోవడం వల్ల ఆభరణాల కొనుగోలుదారులకు ఎలాంటి ఊరట ఇవ్వలేదు. దీనికి తోడు రిస్క్ ఆస్తులపై పెట్టుబడి పెరుగుతుండటంతో బంగారం, వెండి ధరలు కాస్త ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications