Vaishno Devi Temple: భక్తుల నమ్మకంతో వ్యాపారుల ఆటలు.. అమ్మవారికి సమర్పించే వెండిలో భారీ కల్తీ..!
మనం కొనుగోలు చేసే బంగారం, వెండిలో ఎంత స్వచ్ఛత ఉందో తెలుసుకోవాలి. అయితే కొన్నిసార్లు స్వచ్ఛత చూసుకోకుండా కొనుగోలు చేస్తాం. వ్యక్తిగతంగా కొనుగోలు చేసినప్పుడు దాదాపు అందరు స్వచ్ఛతను తనిఖీ చేసుకుంటారు. కానీ దేవుడికి కానుక ఇచ్చినప్పుడు సరిగా చూసుకోరు. ఇలానే జమ్మూలలోని వైష్ణో దేవి ఆలయానికి భక్తులు క్విట్టాళ్ల కొద్ది వెండిని మొక్కుల్లో భాగంగా సమర్పించారు. అయితే ఇప్పుడు ఆ వెండి చర్చ కొనసాగుతోంది. ఎందుకంటే భక్తులు సమర్పించిన వెండిలో స్వచ్ఛత సరిగా లేదు. జమ్మూలోని వైష్ణో దేవి ఆలయానికి దశాబ్దాలుగా యాత్రికు వస్తున్నారు. వారు ఆలయం చుట్టు పక్కల నగల వ్యాపారుల నుంచి వెండి నాణేలు, ఆభరణాలు కొనుగోలు చేసి దేవతకు సమర్పించేవారు.
పుణ్యక్షేత్ర మండలి సంవత్సరాలుగా సుమారు 20 టన్నుల ఈ వెండిని పోగు చేసింది. ఈ సంవత్సరం ఆ వెండిని శుద్ధి చేయడానికి ప్రభుత్వ టంకశాలకు తరలించింది. 20 టన్నుల వెండిపై దాదాపు రూ.500 కోట్లు వస్తాయని పుణ్యక్షేత్ర మండలి ఆశించింది. అయితే అందులో కేవలం 5 నుంచి 6 శాతం మాత్రమే వెండి ఉండని నిపుణులు తేల్చి చెప్పారు. దాని విలువ రూ.30 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఆ వెండిలో ఎక్కువగా ఇనుము, కాడ్మియం, జింక్ మిశ్రమాలు ఉన్నట్లు గుర్తించారు.

ఆ వెండిలో కాడ్మియం ఉండడం వల్ల టంకశాల మొదట దానిని కరిగించడానికి కూడా నిరాకరించింది. కాడ్మియంను దహనం చేస్తే క్యాన్సర్ కారక పొగలు వెలువడతాయని పేర్కొంది. ఆ తర్వాత ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని వెండిని కరిగించారు. ఇది కేవలం ఒక మోసగాడైన ఆభరణాల వ్యాపారి చేసిన పని కాదని ఇది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకదాని చుట్టూ సంవత్సరాల తరబడి జరిగిన వ్యవస్థీకృత కల్తీని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు.
ఎక్కువగా అమ్మకాలు సాగే చోట, భావోద్వేగాలతో కూడిన ప్రాంతంలో, పర్యాటకులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కల్తి ఎక్కువ జరగుతుంది. దేవునికి సమర్పించే నైవేద్యాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఎవరూ స్వచ్ఛతా ధృవీకరణ పత్రం లేదా పన్ను రసీదు అడగరు. ఇదే అదనుగా భావించిన నగల వ్యాపారులు దేవతనే మోసం చేశారు. మనం వెండి, బంగారం ఎక్కడ కొనుగోలు చేసినా తప్పనిసరిగా సరి చూసుకోవాలి. ఈ సంవత్సరం వెండి కిలో రూ.2,71,600 చేరుకుంది. వెండి కూడా ఖరీదైన లోహంగా మారుతుంది. భారతదేశం సంవత్సరానికి 7,000 నుంచి 8,000 టన్నుల వెండిని వినియోగిస్తుందని నివేదికలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications