Lab Grown Diamonds: లక్ష రూపాయల విలువైన డైమండ్ ఇప్పుడు రూ.20 వేలకే లభ్యం..!
ఒకప్పుడు డైమండ్స్ అంటే కేవలం ధనవంతులే కొనేవారు. మధ్యతరగతి, సామాన్యులు బంగారంతోనే సరి పెట్టుకునే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఒకప్పుడు సహజంగా దొరికే డైమండ్స్ ను ఇప్పుడు తయారు చేస్తున్నారు. అవే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. అయితే మొదట్లో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కూడా భారీ ధర ఉండేది. 5 సంవత్సరం క్రితం ఆకాశాన్నంటిన ధరలు ఇప్పుడు దిగొస్తున్నాయి. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఇప్పుడు కేవలం రూ.20 వేలకే లభిస్తున్నాయి. ఇప్పుడు రూ.20 వేలల్లో డైండ్ రింగ్స్ అందుబాటులోకి వచ్చినట్లు చెబుతున్నారు.
పెద్ద క్యారెట్ డైమండ్ కొనాలంటే లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ల్యాబ్-గ్రోన్ డైమండ్స్ తక్కువ ధరల్లోనే డైమండ్స్ లభిస్తున్నాయి. ఒకప్పుడు వజ్రం విలాసానికి, సంపదకు ప్రతీకగా ఉండేది. ప్రస్తుతం ల్యాబ్-గ్రోన్ డైమండ్స్ తక్కువ ధరలో దొరుకుతూ మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. గత 6 సంవత్సరాల్లో వీటి ధరలు ఏకంగా 88 శాతం వరకు పడిపోయింది. గతంలో సహజ వజ్రాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది.. కానీ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కూడా డిమాండ్ పెరుగుతోంది. వీటి ఉత్పత్తి పెరగడంతో ధరలు తగ్గినట్లు చెబుతున్నారు.

2020 నుంచి 2026 మధ్య ల్యాబ్-గ్రోన్ డైమండ్ల ధరలు ఒక్క క్యారెట్‌కు దాదాపు 88 శాతం వరకు తగ్గాయని ఓ నివేదిక పెరిగింది.అందుకే 2 నుంచి 3 క్యారెట్ల సోలిటైర్ డైమండ్లు ఇప్పుడు చాలా మందికి అందుబాటు ధరలకే లభిస్తున్నాయి. యువత, తొలిసారి వజ్రాభరణాలు కొనుగోలు చేసే వినియోగదారులు ల్యాబ్ గ్రోన్ డైండ్స్ పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. భారతీయులకు పెద్ద సోలిటైర్ డైమండ్లపై ప్రత్యేక ఆకర్షణ ఉండటంతో, ల్యాబ్-గ్రోన్ డైమండ్లు ఆ కలను తక్కువ ఖర్చుతో నెరవేర్చుతున్నాయని డీఎల్‌ఎఫ్ రిటైల్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
2032 నాటికి ప్రపంచ ల్యాబ్-గ్రోన్ డైమండ్ మార్కెట్ విలువ 60 నుంచి 100 బిలియన్ డాలర్ల మధ్యకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వీటికి డిమాండ్ పెరగడంతో దేశవ్యాప్తంగా మాల్స్, హైస్ట్రీట్లలో వేగంగా కొత్త స్టోర్లను ప్రారంభిస్తున్నాయి. అయితే సహజ డైమండ్స్‌కి ప్రజల్లో ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోతుందనే అభిప్రాయం సరైందని కాదని నిపుణులు చెబుతున్నారు. దాని ప్రాముఖ్యత దానిదేనని పేర్కొంటున్నారు. పెళ్లిళ్లు, ప్రత్యేక వేడుకలు, భారీ పెట్టుబడి విలువ కలిగిన ఆభరణాల విషయంలో సహజ వజ్రాలకే ఇప్పటికీ ఎక్కువ ఆదరణ ఉందని గుర్తు చేస్తున్నారు. 5 క్యారెట్లకు పైబడిన సహజ వజ్రాలకు డిమాండ్ మళ్లీ పెరుగుతోందని వివరిస్తున్నారు.


Click it and Unblock the Notifications