JettWings: చాలా కాలం తర్వాత దేశీయ విమానయాన రంగంలో ఒకపక్క ఒడిదొడుకులు కొనసాగుతుండగా.. మరోపక్క కొత్త విమానయాన సంస్థల అరంగేట్రం జరుగుతోంది.
ఈ క్రమంలో ఈశాన్య భారతదేశం నుంచి మెుట్టమెుదటి విమానయాన సంస్థగా జెట్‌వింగ్స్ ఎయిర్‌వేస్ అవతరించి చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది. ఈ కంపెనీ అక్టోబర్ 2023 నుంచి తన వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభిస్తుందని తెలుస్తోంది. ఈ క్రమంలో జెట్‌వింగ్స్ ఎయిర్‌వేస్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(NOC) పొందింది.

మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రాంతీయ కనెక్టివిటీ స్కీమ్ UDAN కింద భారతదేశంలో షెడ్యూల్ చేసిన ప్రయాణికుల విమాన రవాణా సేవలను నిర్వహించడానికి కంపెనీకి వీలు కలగనుంది. కంపెనీ ప్రస్తుతం DGCA నుంచి ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ కోసం వేచి ఉంది. అసోం కేంద్రంగా పనిచేస్తున్న క్యారియర్ తన విమానాలను ఖరారు చేస్తోంది. ఈ ప్రక్రియ ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని.. అక్టోబర్ నాటికి కేవలం రెండు విమానాలతో సేవలను ప్రారంభించాలని యోచిస్తోంది.
మెుదట్లో ఎయిర్ వేర్ కేవలం ఈశాన్య ప్రాంతాల్లో మాత్రమే పనిచేస్తుందని తెలుస్తోంది. ఆ తర్వాతి కాలంలో దేశంలోని ఇతర ప్రాంతాలకు సేవలను విస్తరించనుంది. అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఈశాన్య భారతదేశంలో దాని మూలాలు లోతుగా వేళ్లూనుకుని, ప్రత్యేకమైన ఇంకా ముఖ్యమైన గమ్యస్థానాలను కలుపుతూ విశ్వసనీయమైన, స్థిరమైన విమానయాన సంస్థగా మారడానికి కట్టుబడి ఉన్నట్లు వ్యవస్థాపకుడు, CEO సంజయ్ ఆదిత్య సింగ్ తెలిపారు.
ఉడాన్ స్కీమ్ కింద కనెక్టివిటీని మెరుగుపరచడం, కొత్త ఆర్థిక అవకాశాలను సృష్టించడం ద్వారా ఈశాన్య ప్రాంతంపై గణనీయమైన ప్రభావాన్ని చూపడానికి అవకాశం ఉందని సింగ్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications