Bonus Shares: ఎన్ని షేర్లుంటే అన్ని షేర్లు ఉచితం.. దుమ్మురేపుతున్న స్టాక్..
Bonus Shares: ఆర్థిక సంవత్సరంతో పాటు నాలుగో త్రైమాసికం పూర్తి కావటంతో దేశంలోని చాలా కంపెనీలు తమ ఇన్వెస్టర్లకు బోనస్, డివిడెండ్లను చెల్లిస్తున్నాయి. ఈ క్రమంలో ఒక కంపెనీ పెట్టుబడిదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను అందించాలని నిర్ణియించింది. అంటే ఇన్వెస్టర్లు ఎన్ని షేర్లు కలిగి ఉంటే వారికి అన్ని షేర్లు ఉచితంగా పొందుతారన్నమాట.
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది జెట్ ఇన్‌ఫ్రా వెంచర్ కంపెనీ గురించే. ఈ పెన్నీ స్టాక్ తాజా ప్రకటనతో స్టాక్ మార్కెట్లో రాకెట్ వేగంతో లాభపడుతోంది. అయితే ఈక్విటీ హోల్డర్లలో అర్హులను నిర్ధారించేందుకు ఏప్రిల్ 21ని రికార్డు తేదీగా కంపెనీ నిర్ణయించిందని జెట్ ఇన్‌ఫ్రావెంచర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తెలియజేశారు. అంటే ఏప్రిల్ 21 నాటికి కంపెనీ రికార్డు బుక్‌లో షేర్లను కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు మాత్రమే బోనస్ షేర్లు లభించనున్నాయి.

జెట్ ఇన్‌ఫ్రావెంచర్ లిమిటెడ్ రెసిడెంన్షియల్ ప్రాపర్టీలు, ప్రాజెక్టులు అభివృద్ధి చేసే రియల ఎస్టేట్ సంస్థగా పనిచేస్తోంది. ఈ కంపెనీ దేశంలోని మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ మార్కెట్ క్యాప్ రూ.7.67 కోట్లుగా ఉంది. ఈ రోజు సైతం స్టాక్ మార్కెట్లో 5 శాతం అప్పర్ సర్క్యూట్లో లాక్ అయ్యింది. ప్రస్తుతం మార్కెట్లో స్టాక్ ధర రూ.36.57గా ఉంది.
స్టాక్ 52 వారాల గరిష్ఠ ధరను గమనించినట్లయితే రూ.90గా ఉంది. ఈ క్రమంలో కంపెనీ 52 వారాల కనిష్ఠ ధర రూ.22.21గా ఉంది. ప్రస్తుతం వరుసగా నాలుగు రోజుల నుంచి స్టాక్ అప్పర్ సర్క్యూట్ తాకుతూ ఇన్వెస్టర్ల డబ్బును పెంచేస్తోంది.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవటానికి ముందు మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించండి.


Click it and Unblock the Notifications