Multibagger Stock: ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాల వల్ల మార్కెట్లో లిక్విడిటీ తగ్గింది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపై ప్రతికూలంగా ప్రభావితం చూపుతోంది. ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం తీవ్ర ఒడిదొడుకుల్లో ఉన్నాయి. ఈ క్రమంలో జెన్సోల్ ఇంజనీరింగ్ స్టాక్ పురోగతిని సాధించి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అందించింది. 2022 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దాదాపు 380 శాతానికి పైగా స్టాక్ ధర పెరిగింది. బీఎస్ఈలో రూ.54 గా ఉన్న షేర్ రూ. 570 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ రోజు షేర్ విలువ 1.49 శాతం తగ్గింది. ఈ స్టాక్ లో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి 10 లక్షల కంటే ఎక్కువ రాబడి వచ్చింది.

జెన్సోల్ ఇంజినీరింగ్ వ్యాపారం..
జెన్సోల్ ఇంజినీరింగ్ సౌర విద్యుత్ ప్రాజెక్టులు, కన్సల్టెన్సీ సేవలపై దృష్టి పెడుతోంది. దీని ప్రధాన కార్యాలయం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉంది. సోలార్ ప్రాజెక్ట్ అమలు, సోలార్ ప్రాజెక్టుల నిర్మాణం, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, పవర్ ట్రాన్స్‌మిషన్‌కు సంబంధించిన కన్సల్టెన్సీ, సబ్‌స్టేషన్ డిజైన్‌తో వంటి సేవలపై మార్గదర్శకత్వం అందిస్తుంది. ఇప్పటి వరకు 18 రాష్ట్రాల్లో 250కి పైగా ప్రాజెక్టుల ద్వారా 28,000 మెగావాట్ల ఉత్పత్తిని పర్యవేక్షించింది. ఇది కెన్యా, చాడ్, ఈజిప్ట్, యెమెన్, సియెర్రా లియోన్, ఫిలిప్పీన్స్ వంటి ఇతర దేశాల్లోని ప్రాజెక్టులపై పనిచేస్తోంది.

జెన్సోల్ ఇంజినీరింగ్ ధర హిస్టరీ..
ఏడాది కాలంలో ఈ స్టాక్ రూ.54.75 నుంచి రూ.579కి పెరిగింది. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ 958.81 శాతం రాబడిని అందించగా.. ఈ సమయంలో సెన్సెక్స్ సూచీ మాత్రం కేవలం 0.81 శాతం మాత్రమే పెరిగింది. మొత్తంమీద.. స్టాక్ గత సంవత్సరంలో సెన్సెక్స్‌ను నిలకడగా అధిగమించి ఇప్పటి వరకు మల్టీబ్యాగర్ స్టాక్ గా మారింది.

ప్రమోటర్ వాటా వివరాలు..
జెన్సోల్ ఇంజినీరింగ్ కంపెనీలో ప్రమోటర్ గ్రూప్ 71.17 శాతం వాటాను కలిగి ఉంది. మిగిలిన 28.82 శాతం వాటా రిటైల్ ఇన్వెస్టర్ల వద్ద ఉంది. ఈక్విటీపై రాబడి 26.8 శాతం కాగా.. మూలధనంపై రాబడి 22.3 శాతంగా ఉంది. ప్రస్తుతం జెన్సోల్ ఇంజినీరింగ్ మార్కెట్ విలువ రూ.634 కోట్లుగా ఉంది.

గడచిన వారంలో స్టాక్ పర్ఫామెన్స్ ఇలా..
Jensol Engineering షేర్ గత వారంలో 29 శాతం, ఒక నెలలో 72 శాతం లాభపడింది. ఈ ఏడాది ఇప్పటివరకు 434 శాతం పెరిగింది. గత ఏడాది కాలంలో ఈ షేరు 957 శాతం లాభపడింది. ఈ షేర్ 52 వారాల గరిష్ఠ ధర రూ.600 ఉండగా షేర్ కనిష్ఠ ధర రూ.50.77గా ఉంది.


Click it and Unblock the Notifications