2024 Stocks: 2024 కోసం జెఫరీస్ రెండు ఐటీ స్టాక్స్.. TCS, Infosys, HCL Tech, Wipro, TechM
Investment Ideas: పెద్ద ఐటీ సేవల కంపెనీల భవితవ్యంపై ప్రస్తుతం ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీల షేర్లు ఎలా ఉండబోతున్నాయని అనేక మంది అన్వేషిస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రముఖ విదేశీ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ తన 2024 ఔట్‌లుక్ నోట్ విడుదల చేయటం కీలకంగా మారింది. FY25లో భారతీయ ఐటి కంపెనీలకు డిమాండ్ అనిశ్చితి కొనసాగుతుందని అంచనా వేసింది. క్యాలెండర్ 2024 బడ్జెట్‌లకు గణనీయమైన నష్టాలు ఉన్నాయని పేర్కొంది. IT సంస్థలు సపోర్టింగ్ మార్జిన్‌లపై దృష్టి సారిస్తాయని, FY25లో సంవత్సరానికి 7 శాతం స్థిరమైన కరెన్సీ రాబడి వృద్ధిని, 70 బేసిస్ పాయింట్ల మార్జిన్ పెరుగుదలను ఆశిస్తున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం కొనసాగుతున్న డిమాండ్ అనిశ్చితులు, అధిక వ్యాల్యుయేషన్ల నడుమ బ్రోకరేజ్ ఇన్ఫోసిస్, కొఫొర్జీ కంపెనీల షేర్లకు మాత్రమే BUY రేటింగ్ కలిగి ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా నిఫ్టీ ఐపీపై కూడా తాము జాగ్రత్త వహిస్తున్నట్లు జెఫరీస్ పేర్కొంది. ప్రస్తుతం ఫోకస్ మైక్రో అండ్ డిమాండ్ ఎన్విరాన్మెంట్ పైనే కలిగి ఉన్నట్లు బ్రోకరేజ్ వెల్లడించింది. టీసీఎస్ విషయంలో కొత్తగా వచ్చిన సీఈవో కింద వ్యూహాత్మక దిశలో దృష్టి కేంద్రీకరించబడుతుంది. అలాగే టెక్ మహీంద్రా విషయంలో కొత్త సీఈవో కింద సాధ్యమయ్యే మలుపుపై దృష్టి కేంద్రీకరించబడుతుంది.
ఇదే క్రమంలో ఇన్ఫోసిస్, విప్రో కంపెనీల నుంచి కూడా పెట్టుబడిదారులు షేర్ల బైబ్యాక్ ఆశిస్తూ ఎదురుచూస్తున్నారు. అలాగే రానున్న ఏడాదిలో టెక్ మహీంద్రా, కొఫోర్జీ, ఎల్‌టిఐ మైండ్‌ట్రీ కంపెనీలు తమ వ్యాపారాల్లో అధిక మార్జిన్ విస్తరణను చూస్తాయని జెఫరీస్ అంచనా వేసింది. దీంతో ప్రస్తుతం ఇన్వెస్టర్లు జెఫరీస్ నివేదికలో పేర్కొన్ని కొన్ని టెక్ కంపెనీల షేర్లపై అత్యధికంగా తమ పెట్టుబడి ఆసక్తిని కనబరుస్తున్నారు.


Click it and Unblock the Notifications