ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ తన ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్‌లో 3 బిలియన్ డాలర్ల స్టాక్స్‌ను విక్రయించారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం అమెజాన్ స్టాక్స్ 75 శాతం ఎగిశాయి. స్టాక్స్ భారీగా ఎగిసిన సమయంలో జెఫ్ బెజోస్ పెద్ద ఎత్తున షేర్లు అమ్మి సొమ్ము చేసుకున్నారు. స్టాక్స్ అమ్మడానికి గల కారణాలను బెజోస్ వెల్లడించలేదు. అయితే తన బ్లూ ఆరిజిన్ స్పేస్ కంపెనీ, ఇతర వెంచర్ల కోసం స్టాక్స్ విక్రయిస్తూ వస్తున్నారు.

3 బిలియన్ షేర్ల విక్రయం
లార్జ్ హోల్డింగ్స్ బిలియనీర్లు సాధారణంగా తమ పోర్ట్‌పోలియోలను వివిధ రంగాల్లో విస్తరిస్తారు. వారు పెట్టుబడులు దాదాపుగా ఒకేదాంట్లో ఉండవు. ఈ ఏడాది ఫిబ్రవరి, ఆగస్ట్ నెలల్లో జెఫ్ బెజోస్ పెద్ద మొత్తంలో స్టాక్స్ విక్రయించారు. అమెజాన్ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం ఈ సంవత్సరం 10 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన షేర్లను విక్రయించారు. 2019 నుండి చూస్తే ఇది 3 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంది. జెఫ్ బెజోస్ స్టాక్స్ విక్రయంపై అమెజాన్ స్పందించాల్సి ఉంది.

బ్లూఆరిజిన్ సంస్థ కోసం ఏటా 1 బిలియన్ డాలర్లు
తన బ్లూ ఆరిజిన్ సంస్థ కోసం ఏటా 1 బిలియన్ విలువైన స్టాక్స్‌ను విక్రయిస్తానని జెఫ్ బెజోస్ గతంలో తెలిపారు. కమర్షియల్ ఆపరేషన్స్ కోసం ఈసారి ఒక బిలియన్ డాలర్లు విక్రయించారు. వాతావరణ మార్పులపై పోరు కోసం ఇటీవల 10 బిలియన్ డాలర్ల నిధిని ప్రారంభించారు. గత నెలలో బ్లూఆరిజిన్ స్పేస్ టూరిజం రాకెట్‌ను లాంచ్ చేసింది. అయితే ఇది ఇంకా మానవసహితం కావాల్సి ఉంది.

అయినా బెజోసే కుబేరుడు
జెఫ్ బెజోస్ గతంలో తన భార్యకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. అతి ఖరీదైన విడాకుల ఒప్పందంగా నిలిచింది. ఇప్పుడు బ్లూఆరిజిన్ కోసం అమెజాన్‌లో పెద్ద ఎత్తున స్టాక్స్ విక్రయిస్తున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం పెద్ద మొత్తంలో షేర్లు తీసేసినప్పటికీ ఇప్పటికి ప్రపంచ అత్యంత ధనికుడిగా జెఫ్ బెజోసే ఉన్నారు. అతని వద్ద 191 బిలియన్ డాలర్ల సంపద ఉంది. ఈ ఏడాది అతని ఆదాయం 76 బిలియన్ డాలర్లు పెరిగింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications