పెళ్లయిన వారం రోజుల్లోనే రూ.6,300 కోట్లు విలువైన షేర్లను అమ్మిన జెఫ్ బెజోస్

ప్రపంచంలో అత్యంత సంపన్నులలో ఒకరైన జెఫ్ బెజోస్ ఇటీవల తన ప్రేయసి లారెన్ సాంచెజ్‌ను వివాహం చేసుకున్నాడు. పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది కానీ, అంతే వేగంగా షేర్ మార్కెట్‌లో కూడా అతని చేతులు కదిలాయి! వివాహం జరిగిన కొన్ని రోజుల్లోనే వేల కోట్ల రూపాయల విలువైన అమెజాన్ షేర్లను అమ్మటం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇది హఠాత్‌గా తీసుకున్న నిర్ణయం కాదు అసలైన వ్యాపారవేత్త ఎలా ఆలోచిస్తాడో చూపించిన పద్ధతిలో, ముందే వేసుకున్న వ్యూహానికి ఇది ఒక భాగం.

Jeff Bezos Amazon share sale Bezos marriage Amazon stock price Share sale impact Amazon company Stock market 10b5-1 trading plan Blue Origin World s richest person Amazon earnings 10b5-1

ఈ అమ్మడం వెనక ఒక నిగూఢమైన ఫైనాన్షియల్ వ్యూహం ఉంది అని నిపుణులు చెప్తున్నారు. పెళ్లి తర్వాత ప్లాన్ ప్రకారం షేరు అమ్మకాలు జరిగాయి. జెఫ్ బెజోస్ ఇటీవలే తన ప్రేయసి లారెన్ సాంచెజ్ ను జూన్ 27న ఇటలీలో వివాహం జరిగిన మరుసటి రోజునే, వేల కోట్ల విలువైన షేర్లను అమ్మేశాడు. ఇది ఎవరైనా పెళ్లి ఖర్చుల కోసం కావచ్చు అని ఊహించవచ్చు. కానీ అసలు కథ ఏంటంటే

అమెరికాలో "Rule 10b5-1" అనే ఒక నిబంధన ప్రకారం, పెద్ద సంస్థలలో ఉన్న కీలక వ్యక్తులు ముందుగానే షెడ్యూల్ చేసిన షేరు అమ్మకాలు చేయొచ్చు. భవిష్యత్తులో వారి నిర్ణయాలు మార్కెట్‌ను ప్రభావితం చేయకుండా ఉండేందుకే ఈ రూల్.

ఎంత మొత్తం అమ్మాడంటే?
అతను అమ్మిన అమెజాన్ షేర్ల విలువ సుమారు $737 మిలియన్ డాలర్లు, అంటే మన భారత కరెన్సీలో చూస్తే సుమారు రూ. 6,300 కోట్లు. ఇది ఒక్క రోజు అమ్మకం మాత్రమే. మొత్తంగా చూస్తే బెజోస్ వద్ద ఇంకా లక్షల కోట్ల విలువైన షేర్లు మిగిలే ఉన్నాయి. ఈ ప్లాన్ ప్రకారం, 2026 మే వరకు బెజోస్ మొత్తం 25 మిలియన్ షేర్లు అమ్మే అవకాశం ఉంది.

2025లో జెఫ్ బెజోస్ తన సంపదలో భాగాన్ని సామాజిక సేవా కార్యకలాపాలకు ఉపయోగిస్తూ మానవతా దృక్పధాన్ని చూపించాడు. ఆయన దాదాపు 9.3 లక్షల అమెజాన్ షేర్లను వివిధ సేవా సంస్థలకు దానం చేశారు. ఇందులో 2025 మార్చిలో సుమారు $60 మిలియన్ విలువైన షేర్లు, మే నెలలో $125 మిలియన్ విలువైన షేర్లు, అలాగే జూన్‌లో $5 మిలియన్ విలువైన షేర్లు ఉన్నాయి. ఈ షేర్ల దానం ద్వారా జెఫ్ బెజోస్ సమాజం పట్ల తన బాధ్యతను మరోసారి చాటిచెప్పాడు.

ఇది చూసిన తర్వాత ఒక విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు పెద్ద మనుషుల ఆలోచనలు పెద్దవే! వివాహం వంటి వ్యక్తిగత ఘట్టం జరిగినప్పటికీ, బెజోస్ తన పెట్టుబడుల ప్లాన్‌ను ముందుగానే సిద్ధం చేసుకుని, వ్యాపారమే కాదు, వ్యక్తిగత జీవితం కూడా సమానంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. వృత్తి ప్రణాళికలు ఎలా నడపాలి అనే విషయంలో ఆయన బహుశా ఒక ఆదర్శంగా నిలుస్తాడు.

జెఫ్ బెజోస్ లాంటి పెద్ద షేర్ హోల్డర్‌లు షేర్లు అమ్మినప్పుడు, మార్కెట్‌లో కొంతకాలం మిశ్రమ స్పందన కనిపించవచ్చు. కానీ, ఈ అమ్మకాలు ముందే ప్రకటించినవి, షెడ్యూల్ ప్రకారం జరిగినవి కాబట్టి పెట్టుబడిదారులు సాధారణంగా దీన్ని నెగెటివ్‌గా తీసుకోరు. అందువల్ల, తాజా షేర్ అమ్మకాల కారణంగా అమెజాన్ స్టాక్ ధరపై ఎటువంటి గణనీయమైన నెగెటివ్ ప్రభావం కనిపించదు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+