RuPay Card: షాపింగ్ ప్రియులకు రూపే డెబిట్, క్రెడిట్ కార్డ్ పెద్ద వరం అని చెప్పుకోవాలి. ఈ కార్డులు వినియోగదారులకు ఏకంగా 40 శాతం వరకు క్యాష్ బ్యాక్ అందిస్తున్నాయి. షాపింగ్ చేసిన తర్వాత కస్టమర్లు ఈ బంపర్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందుతారు. ప్రస్తుతం న్యూ ఇయర్, క్రిస్టమస్, సంక్రాంతి వంటి వరుస పండుగలు ఉండటంతో ఈ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. దీనిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
JCB ఇంటర్నేషనల్ కంపెనీ లిమిటెడ్ రూపే డెబిట్, క్రెడిట్ కార్డ్ హోల్డర్లందరికీ ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఆఫర్ ప్రకారం RuPay JCB కార్డ్‌ని ఉపయోగించే కస్టమర్‌లు ఆఫర్ వ్యవధిలో ఆస్ట్రేలియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని రిటైల్ స్టోర్‌లలో 40% క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఈ ఆఫర్ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే ఈ ప్రయోజనాలు భారత కస్టమర్లకు ప్రస్తుతం అందుబాటులోకి రాలేదు. ఎన్ఆర్ఐ వినియోగదారులు దీనిని ఉపయోగించుకోవచ్చని తెలుస్తోంది.

ఈ ఆఫర్‌లో వినియోగదారులు ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.3,000 క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఈ ఆఫర్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం.. www.rupay.co.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. కరోనా తర్వాత ప్రజలు అంతర్జాతీయ ప్రయాణాలు పెరిగినందున ఈ ఆఫర్ ఎంతగానో ఉపయోగకరమని JCB ఇంటర్నేషనల్ కంపెనీ లిమిటెడ్ ప్రెసిడెంట్, COO అయిన యోషికి కనెకో అన్నారు. భారతీయ కార్డ్ హోల్డర్లు తమ ప్రాధాన్య ప్రయాణ గమ్యస్థానంలో ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఈ ఆఫర్లను పొందవచ్చని తెలుస్తోంది. ఈ ఆఫర్‌ను అందించే ప్రధాన ప్రపంచ చెల్లింపుల బ్రాండ్ JCB. కంపెనీ 1961లో జపాన్‌లో తన కార్డ్ వ్యాపారాన్ని ప్రారంభించింది.


Click it and Unblock the Notifications