Wipro News: టెక్ దిగ్గజం విప్రోకు భారీ షాక్ ఇచ్చిన కాగ్నిజెంట్.. ఏమైందంటే..??
Wipro News: దేశంలో టాప్-5 టెక్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న విప్రోను సమస్యలు నీడలా వెంటాడుతూనే ఉన్నాయి. కంపెనీ నుంచి ఉన్నత స్థాయి బ్రెయిన్ డ్రెయిన్ కొనసాగుతూనే ఉంది.
దాదాపు 21 ఏళ్ల పాటు కంపెనీలో అనేక స్థాయిల్లో పనిచేసి ఇటీవల విప్రోకు వెటరన్ జతిన్ దలల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే.. ఇదే రంగంలో ప్రత్యర్థి కంపెనీ అయిన కాగ్నిజెంట్ నూతన సీఎఫ్ఓగా చేరటమే. అవును జాన్ సీగ్మండ్ 2024 ప్రారంభంలో పదవీ విరమణ చేస్తుండగా ఆ స్థానంలోకి జతిన్ దలాల్ రానున్నారు.

దీనిని ధృవీకరిస్తూ.. దలాల్ కాగ్నిజెంట్ తదుపరి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా నియమితులైనట్లు కంపెనీ సెప్టెంబర్ 28న ప్రకటించింది. దలాల్ నియామకం డిసెంబర్ 2023 నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. అలాగే అవుట్‌గోయింగ్ CFO Jan Siegmund.. ట్రాన్ఫర్మేషన్ కోసం కోసం నాన్-ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ప్రత్యేక సలహాదారుగా కొనసాగనున్నారని వెల్లడైంది.
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న టెక్ దిగ్గజం విప్రోలో 21 ఏళ్లు సుదీర్ఘ పని అనుభవం కలిగిన దలాల్ గడచిన ఎనిమిదేళ్లుగా సీఎఫ్ఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా రాజీనామా ప్రకటించిన తర్వాత.. విప్రో అపర్ణ అయ్యర్ ను కొత్త సీఎఫ్ఓగా నియమించింది. దలాల్ తాజాగా ప్రపంచవ్యాప్త ఆర్థిక ప్రణాళిక & విశ్లేషణ, అకౌంటింగ్ & నియంత్రణ, పన్ను, ట్రెజరీ & అంతర్గత ఆడిట్, కార్పొరేట్ అభివృద్ధి, పెట్టుబడిదారుల సంబంధాలు, ఎంటర్‌ప్రైజ్ రిస్క్ మేనేజ్‌మెంట్ విధులను పర్యవేక్షిస్తారని కాగ్నిజెంట్ తెలిపింది.


Click it and Unblock the Notifications