Paytm News: పేటీఎం కంపెనీకి పెద్ద తలకాయ షాక్.. పాపం రిటైల్ ఇన్వెస్టర్స్..
Softbank: గడచిన కొన్ని నెలలుగా దేశంలోని ఫిన్ టెక్ స్టార్టప్ కంపెనీ పేటీఎం దూకుడుకు కళ్లెం పడింది. ఇతర ఆటగాళ్ల కంటే వేగంగా విజయ్ శేఖర్ శర్మ ఆలోచనలు, టెక్నాలజీ ఉన్నప్పటికీ నిర్వహణలోని కొన్ని పొరపాట్లు కంపెనీకి పెద్ద నష్టాన్ని కలిగించాయి. ఈ క్రమంలో ఏకంగా ఆర్బీఐ నుంచి కఠిన ఆంక్షలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో జపాన్‌కు చెందిన ప్రముఖ పెట్టుబడిదారు సంస్థ సాఫ్ట్‌బ్యాంక్ పేటీఎంలో తాను కలిగి ఉన్న 1.4 శాతం వాటాలను సైతం అమ్మేసినట్లు తాజాగా వెల్లడైంది. జూన్ నెల పేటీఎం కంపెనీ షేర్ హోల్డింగ్ డేటా ప్రకారం సాఫ్ట్‌బ్యాంక్‌కు సంబంధించిన SVF India Holdings(Cayman) Limited పేటీఎం మాతృసంస్థలో తనకున్న మెుత్తం వాటాలను విక్రయించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి సాఫ్ట్‌బ్యాంక్ నవంబర్ 2022 నుంచి గత నెల వరకు క్రమం తప్పకుండా Paytm షేర్లను ఆఫ్‌లోడ్ చేస్తోంది. అలా మార్చి 2024 నాటికి డిజిటల్ పేమెంట్స్ కంపెనీలో తన వాటాలను 1.4 శాతానికి తగ్గించబడింది.

పేటీఎం కంపెనీ దేశీయ ఈక్విటీ మార్కెట్లలో తన ఐపీవోను లాంచ్ చేసిన 2021లో సాఫ్ట్‌బ్యాంక్ దాదాపు 18.5 శాతం వాటాను కలిగి ఉంది. ఇది లాభాలను ఆర్జించిన బీమా మార్కెట్‌ప్లేస్ పాలసీబజార్ మాతృ సంస్థ అయిన PB ఫిన్‌టెక్‌లో సాఫ్ట్‌బ్యాంక్ తన వాటాను పూర్తిగా విక్రయించిన కొన్ని నెలల తర్వాత వచ్చింది. వాస్తవానికి సాఫ్ట్‌బ్యాంక్ ప్రారంభ రోజుల్లో PB ఫిన్‌టెక్‌లో దాదాపు 200 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది.బీమా అగ్రిగేటర్‌లో దాని మొత్తం పెట్టుబడిపై సుమారు 650 మిలియన్ డాలర్ల రాబడిని ఆర్జించవచ్చని నివేదిక ప్రకారం తెలుస్తోంది.
ఇదే క్రమంలో ప్రముఖ హెడ్జ్ ఫండ్ ట్రీలైన్ పేటీఎంలో తమ వాటాలను వరుసగా 1.08, 1.08 శాతానికి విస్తరించింది. మొత్తంమీద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వాటా పేటీఎంలో 39.77 నుంచి 37.77 శాతానికి 2 శాతం క్షీణించింది. అలాగే మ్యూచువల్ ఫండ్ సంస్థలు మిరే మ్యూచువల్ ఫండ్, నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ మెుదటి త్రైమాసికంలో పేటీఎంలో 0.65 శాతం నుంచి 6.80 శాతానికి పెరిగింది.
అలాగే కంపెనీలో రిటైల్ షేర్ హోల్డింగ్ వరుసగా 1.30 శాతం నుంచి 16.56 శాతానికి పెరిగింది. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా 0.29 శాతం పెరిగి 6.86 శాతం నుంచి 7.15 శాతానికి చేరుకుంది.


Click it and Unblock the Notifications