Expensive Whiskey: ఒక్క గ్లాస్ విస్కీ రేటు రూ.4.7 కోట్లు.. బాటిలో రేటు వింటే మైండ్ బ్లాంక్ అవుద్ది.. ఎక్కడంటే.
Expensive Whiskey: మందుబాబులు రేటు ఎంత ఉన్నా తగ్గేదే లే అని అంటుంటారు. ఎందుకంటే వారికి ఉండే అలవాటు అలాంటిది. ఇలాంటి వారికి ఒక్క గ్లాస్ విస్కీ రేటు ఏకంగా కోట్లలో ఉంటుందని తెలిస్తే.. షాక్ అవ్వక మానరు. అవునండీ బాబు ఇలాంటి ఆశ్చర్యకర విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

యమజాకి 55..
వినటానికి వింతగా ఉన్నా జపాన్ కు చెందిన యమజాకి అనే బ్లాండ్ విస్కీ రేటు చాలా ఘాటు. ఇది మామూలు విస్కీ కాదు, 55 ఏళ్ల పురాతనమైన బాటిళ్లను అమ్ముతుంటుంది. 2020 కరోనా లాక్ డౌన్ సమయంలో కంపెనీ లాటరీ విధానం ద్వారా 100 ఓల్డ్ విస్కీ బాటిళ్లను రికార్డు ధరకు విక్రయించింది. అలా 2021లో సైతం కంపెనీ మరో 100 బాటిళ్లను అమ్మింది. వీటిలో ఒకటి ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లోని డ్యూటీ ఫ్రీ స్టోర్‌లో 4.88 లక్షల యూరోలకు అమ్మబడింది. దాని ధర మన భారత కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ.4.14 కోట్లుగా ఉండటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

సింగిల్ మాల్ట్..
ఈ యమజాకీ 55 రకం విస్కీని తొలిసారిగా 1960లో డిస్టిల్ చేశారు. ఇది మూడు వివిధ రకాల సింగిల్ మాల్క్ విస్కీలను కలిపి తయారు చేయటం విశేషం. దీనిని అప్పట్లో వ్యవస్థాపకుడైన షింజిరో టోరీ పర్యవేక్షణలో చెక్క పెట్టేల్లో నిల్వ చేసి రుచికరంగా ఓల్డ్ విస్కీని తయారు చేయటం ప్రారంభించారు. ఈ ఏడాది 750 ml Yamazaki 55 విస్కీ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ఆక్షన్ హౌస్ Sothebyలో వేలం వేయబడుతోంది.

కంపెనీ వివరాలు..
ఈ ప్రఖ్యాత విస్కీని తయారు చేస్తున్న సుంటోరీ కంపెనీ 1899లో జపాన్‌లోని ఒసాకా ప్రాంతంలో ప్రారంభించబడింది. ఆ దేశంలో ఇదొక పురాతన మద్యా తయారీ కంపెనీ కావటం విషేషం. షింజిరో టోరీ దీనిని ప్రారంభించగా.. ప్రస్తుతం నోబుహిరో టోరీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

సంచలన ధరకు వేలం..
కంపెనీ గడచిన 55 ఏళ్లుగా తన ప్రసిద్ధ విస్కీని మద్యం ప్రియులకు చేరువ చేస్తున్నారు. క్వాలిటీ విస్కీ బ్రూవింగ్ చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు పొందుతున్నారు. ఈ విస్కీ ఒక్క షాట్ ధర రూ.4.7 కోట్లు ఉండగా.. బాటిల్ విస్కీ ధర ఏకంగా 65.2 కోట్లుకు వేలం పాటలో 750 ml బాటిల్, సోథెబీస్‌లో విక్రయించబటం సంచలనంగా మారింది.


Click it and Unblock the Notifications