Softbank: పేటీఎంకు ప్రముఖ జపనీస్ ఇన్వెస్టర్ సాఫ్ట్‌బ్యాంక్ గట్టి షాక్ ఇచ్చింది. క్రమంగా తన షేర్ హోల్డింగ్‌ను తగ్గించుకుంటూ వస్తూ.. మరో అడుగు ముందుకేసింది. అయితే అదే సమయంలో మరో రెండు స్టార్టప్‌లకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఓపెన్ మార్కెట్ కార్యకలాపాల సాఫ్ట్‌బ్యాంక్ గత నెలలో పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లో వాటాలు విక్రయించింది. భారతదేశంలో తన అతిపెద్ద లిస్టెడ్ ఇన్వెస్ట్‌మెంట్ నుంచి 2 శాతాన్ని తగ్గించుకుంది. దీంతో దాని వాటా దాదాపు 5.06 శాతానికి క్షీణించింది. గతేడాది ఈ ఫిన్‌టెక్ దిగ్గజంలో 7 శాతం షేర్ కలిగి ఉన్న సాఫ్ట్‌బ్యాంక్.. డిసెంబర్‌లో 0.55 శాతం, జనవరిలో 1.4 శాతాన్ని ఆఫ్‌లోడ్ చేసింది.

'డిసెంబర్ 19,2023 మరియు జనవరి 20,2024 మధ్య SVF ఇండియా హోల్డింగ్స్ (కేమాన్) లిమిటెడ్ భారీ షేర్ డిస్పోజల్స్ నిర్వహించింది. ఇందులో భాగంగా వన్97 కమ్యూనికేషన్స్‌లో మొత్తం 1 కోటీ 27 లక్షలకుపైగా షేర్లను ఆఫ్‌లోడ్ చేసింది. సెబీ టేకోవర్ రూల్స్‌లోని నిబంధనల ప్రకారం థ్రెషోల్డ్‌కు అనుగుణంగా ఈ ప్రక్రియ జరిగింది' అని జపనీస్ ఇన్వెస్టర్ ఓ ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుత 2 శాతం వాటా విక్రయం విలువ దాదాపు 950 కోట్లుగా ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. డిసెంబర్ 2023తో ముగిసిన మూడవ త్రైమాసికంలో దేశీయ రిటైల్ ఇన్వెస్టర్లు పేటీఎంలో తమ వాటాను 12.85 శాతానికి పెంచుకున్నారు. అంతకు ముందు త్రైమాసికం నాటికి ఇది 8.28 శాతంగా ఉంది. జపనీస్ పెట్టుబడిదారుల వాటాను కొనుగోలు చేసే దేశీయ సంస్థల భాగం కూడా 4.06 శాతం నుంచి 6.06 శాతానికి పెరిగింది.
గతేడాది నుంచి విడతల వారీగా పేటీఎంలో వాటాల విక్రయంతో పాటు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో నుంచి సాఫ్ట్‌బ్యాంక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్, SVF గ్రోత్ (సింగపూర్) నిష్క్రమించింది. వీటి ద్వారా సుమారు 1,125 కోట్లు పొందింది. స్విగ్గీ, ఫస్ట్ క్రై మరియు ఓలా ఎలక్ట్రిక్ వంటి ఇండియన్ స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టనున్నట్లు EMEA హెడ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.


Click it and Unblock the Notifications