టెస్లా తర్వాత జపాన్ నెక్సాన్, బిట్‌కాయిన్‌లోకి భారీ పెట్టుబడులు
జపాన్‌కు చెందిన గేమ్స్ మేకర్ నెక్సాన్ క్రిప్టోకరెన్సీకి ఉత్సాహాన్ని ఇచ్చే ప్రకటన చేసింది. క్రిప్టో కింగ్ బిట్ కాయిన్‌ను కొనుగోలు చేసేందుకు దాదాపు 100 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు బుధవారం నాడు వెల్లడించింది. తద్వారా టెస్లా ఇంక్ వంటి కంపెనీలకు ఇవి జత కట్టింది. వీటిని కొనుగోలు చేసేందుకు నెక్సాన్ తన రిజర్వ్స్‌లో రెండు శాతాన్ని కేటాయిస్తున్నట్లు తెలిపింది. బిట్ కాయిన్ సగటు వ్యాల్యూ రూ.58,000 డాలర్ల వద్ద ఈ కొనుగోలు చేస్తామని తెలిపింది.

భవిష్యత్తు పెట్టుబడుల కోసం
భవిష్యత్తు పెట్టుబడుల కోసం తమ నగదు విలువను కొనసాగిస్తూనే, బిట్ కాయిన్ దీర్ఘకాలిక స్థిరత్వం, ద్రవ్యతను అందిస్తుందని తాము విశ్వసిస్తున్నామని నెక్సాన్ సీఈవో ఓవెన్ మాహోనీ అన్నారు. బిట్ కాయిన్‌లో పెట్టుబడులకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. తమ నగదు నిల్వలను వర్క్‌లో ఉంచే ఉద్దేశ్యంలో భాగంగా వినోద సంస్థ కోనామీలో పెట్టుబడులు పెట్టింది.

కార్ల కంటే బిట్ కాయిన్ ద్వారా ఎక్కువ
టెస్లా ఇంక్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్‌పైన 1.5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో బిట్ కాయిన్‌ను కొనుగోలు చేసింది టెస్లా ఇంక్. లిక్విడిటీకి బిట్ కాయిన్ ప్రత్యామ్నాయమని స్పష్టం చేసేందుకు బిట్ కాయిన్ పెట్టుబడిలో కొంతమొత్తాన్ని విక్రయించింది. టెస్లా కంపెనీకి కార్ల అమ్మకాలతో పోలిస్తే బిట్ కాయిన్ ద్వారా ఎక్కువ ట్రేడింగ్ అయింది.

55వేల డాలర్ల స్థాయికి
బిట్ కాయిన్ వ్యాల్యూ నేడు 55వేల డాలర్ల స్థాయికి చేరుకుంది. నేడు బిట్ కాయిన్ 54,877.30 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత వారం టర్కీ క్రిప్టో నిషేధం, జోబిడెన్ డబుల్ ట్యాక్స్ ఎఫెక్ట్‌తో బిట్ కాయిన్ 50 డాలర్ల దిగువకు చేరుకుంది. అయితే ఇప్పుడు తిరిగి పుంజుకున్నాయి. ఏడాది కాలంలో బిట్ కాయిన్ వ్యాల్యూ 700 శాతం కంటే ఎక్కువ పెరిగింది.


Click it and Unblock the Notifications