Pawan Kalyan-anna konidela Divorce: విడిపోయిన పవన్ కల్యాణ్, అన్న కొణిదెల.. పిల్లల పరిస్థితి ఏంటి..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, సూపర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తి జీవితంలో కీలక మార్పు చోటు చేసుకుంది. తన 13 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్న కొణిదేల అలియాస్ అన్నా లెజ్నెవా పరస్పర అంగీకారంతో వీడిపోతున్నట్లు ప్రకటించారు. ఇద్దరు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. సోమవారం రాత్రి ఈ ప్రకటన వెలువడటంతో సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ దారితీసింది. కాగా తమ వైవాహిక బంధం ముగిసినప్పటికీ మంచి స్నేహితులుగా కొనసాగుతామని పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల పేర్కొన్నారు. తమ పిల్లల బాధ్యతను తల్లిదండ్రులుగా ఇద్దరూ కలిసి నిర్వర్తిస్తామని ప్రకటించారు.

పిల్లల సంతోషం, భవిష్యత్తు, శ్రేయస్సు తమకు ఎప్పటికీ అత్యంత ప్రాధాన్యమన్నారు. ఈ వ్యక్తిగత నిర్ణయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని, తమపై సానుభూతితో వ్యవహరించాలని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు. ఇన్నాళ్లూ తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు. పవన్ కల్యాణ్, అనా కొణిదెల 2013 సెప్టెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు.
రష్యాకు చెందిన అన్నా లెజినోవా వివాహం అనంతరం అన్నా కొణిదెలగా పేరు మార్చుకున్నారు. పవన్ కల్యాణ్ నటించిన తీన్ మార్ సినిమా సమయంలో వీరిద్దరికీ పరిచయం అయింది. వీరిద్దరికీ ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పిల్లల భవిష్యత్తు, సంతోషం తమ ఉమ్మడి బాధ్యతగా తీసుకుంటామని తెలిపారు.

pawan kalyan

పవన్ కల్యాణ్ గతంలో రెండుసార్లు వివాహం చేసుకున్నారు. 1997లో నందినిని వివాహం పెళ్లి చేసుకున్నారు. 2008లో విడాకులు తీసుకున్నారు. అనంతరం 2009లో నటి రేణు దేశాయ్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. 2012లో వీరి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2013లో అన్నా లెజినోవాను లగ్గం చేసుకున్నారు. పవన్ కల్యాణ్, అనా కొణిదెల విడిపోవడానికి గల కారణాలను సంయుక్త ప్రకటనలో పేర్కొనలేదు. వ్యక్తిగత విషయాలపై ఎలాంటి వివరాలు కూడా అందులో ప్రస్తావించలేదు.

అలాగే విడాకుల చట్టపరమైన ప్రక్రియ, పిల్లల సంరక్షణకు సంబంధించిన ఏర్పాట్లను పేర్కొనలేదు. అయితే ఈ నిర్ణయం పరస్పర అంగీకారంతో తీసుకున్నట్ చెప్పారు. విడాకులకు సంబంధించి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విడాకులపై సినీ వర్గాలు, రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+