మన దేశంలో చాలా మందికి బ్యాంకింగ్ సేవలు అందకపోవడం వల్ల 2014లో ప్రధానమంత్రి జనధన్ యోజన (PMJDY) అనే పథకం మొదలైంది. ఈ పథకం ముఖ్య లక్ష్యం ఏంటి అంటే "ప్రతి కుటుంబానికి కనీసం ఒక బ్యాంక్ ఖాతా ఉండాలి" అనే ఆలోచన. ఇప్పుడు ఈ పథకం 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా 55 కోట్లకు పైగా జనధన్ ఖాతాలు ఉన్నాయి. ఈ ఖాతాల ద్వారా ప్రభుత్వ సబ్సిడీలు, పథకాలు నేరుగా డబ్బు రూపంలో చేరుతున్నాయి. కానీ చాలా ఖాతాలలో చిరునామా మార్పులు, వ్యక్తిగత వివరాలు అప్‌డేట్ కాలేదు. ఈ సమస్యల వలన అనేక ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే RBI ఇప్పుడు రీ-కేవైసీ (Re-KYC) తప్పనిసరి చేసింది. బ్యాంకులో మీ వివరాలు సరిచూసుకోవాలి.
ఎప్పుడు చేయాలి?
ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన గడువు ప్రకటించింది అన్ని బ్యాంక్ ఖాతాలు, పెన్షన్ ఖాతాలు, ఇన్వెస్ట్మెంట్‌లు, బీమా మొదలైన వాటికి రీ-కేవైసీ (Re-KYC) తప్పనిసరి. దీని చివరి తేదీ 2025 సెప్టెంబర్ 30.
ఈ ప్రక్రియను ప్రజలకు సులభంగా అందించడానికి జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించబడతాయి. ఈ శిబిరాలు పట్టణాల నుంచి పంచాయత్ స్థాయి వరకు ఏర్పాటు చేయబడతాయి. గ్రామాల్లో ఉన్నవాళ్లు కూడా దగ్గరలోనే రీ-కేవైసీ పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇలా శిబిరాలు ఏర్పాటు చేయడం వల్ల, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు లేదా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లడం కష్టంగా ఉండే వారు కూడా సులభంగా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.
అవసరమైన పత్రాలు
రీ-కేవైసీ చేయించుకోవడానికి కేవలం ఒక ఐడీ ప్రూఫ్ (ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్) ఉంటే సరిపోతుంది. ఇవి అడ్రస్ ప్రూఫ్, ఐడీ ప్రూఫ్ రెండింటికీ సరిపోతాయి. ఇలా చేస్తే మీ ఖాతా బ్లాక్ అయ్యే ప్రమాదం ఉండదు, చిరునామా-ఫోన్ నంబర్ వంటి వివరాలు అప్‌డేట్ అవుతాయి, ప్రభుత్వ పథకాల డబ్బు నేరుగా మీ ఖాతాకు వస్తూనే ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడైనా ఖాతా వాడటంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఇది ఒక సాధారణ ఫార్మాలిటీ మాత్రమే. ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. కానీ మీరు గడువు తేది మిస్ అయితే మీ ఖాతా తాత్కాలికంగా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్ 30, 2025లోపు తప్పకుండా రీ-కేవైసీ పూర్తి చేయండి. ఇది మీ భద్రత కోసం తీసుకున్న ఒక జాగ్రత్త చర్య. కాబట్టి ఆలస్యం చేయకుండా, మీ సమీప బ్యాంక్ బ్రాంచ్ లేదా ప్రత్యేక శిబిరానికి వెళ్లి రీ-కేవైసీ పూర్తి చేయండి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications