6 నెలల్లో పెట్టుబడి ఎనిమిదింతలు.. ఈ సూపర్ స్టాక్ మీరూ కొన్నారా..??
Multibagger Stock: చాలా మంది చిన్న స్టాక్స్ మీద మనసు పారేసుకుంటుంటారు. ఎందుకంటే అవి తక్కువ ధరకు ఆకర్షనీయంగా కనిపిస్తుంటాయి కాబట్టి. అయితే ఈ పెన్నీ స్టాక్స్‌లో చాలా ఎక్కువ రిస్క్ ఉంటుందని గుర్తుంచుకోవాలి.
2023 ఎన్నికలకు ముందు ఏడాది కావటంతో సాధారణంగానే మార్కెట్లు మంచి ర్యాలీని కలిగి ఉన్నాయి. దీనికి తోడు ఇటీవల ప్రపంపచ వ్యాప్తంగా ఇండియాకు పెరుగుతున్న ఆధరణతో విదేశీ సంస్థాగత పెట్టుబడుల వెల్లువతో చాలా కాలంగా మార్కెట్లు ర్యాలీ కొనసాగిస్తూ.. సెన్సెక్స్, నిఫ్టీలు చారిత్రాత్మక గరిష్ఠాలను నమోదు చేశాయి. ఈ క్రమంలో మల్టీబ్యాగర్ రాబడులను అందించిన జై బాలాజీ ఇండస్ట్రీస్ స్టాక్ ప్రస్తుతం తన రాబడులతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కేవలం రూ.6 కోట్ల మార్కెట్ క్యాప్ కలిగి ఉన్న కంపెనీ ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిపించింది. మార్చి 20న రూ.44.20 వద్ద ఉన్న స్టాక్ ఆరు నెలల కాలంలో ఏకంగా 748 శాతం రాబడిని ఇన్వెస్టర్లకు అందించింది. అలా ఇన్వెస్టర్ల పెట్టుబడి ఏకంగా 8 రెట్లు పెరిగింది. ఎవరైనా ఇన్వెస్టర్ ఆరు నెలల కిందట కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి ఉంటే.. ప్రస్తుతం దాని విలువ రూ.8.48 లక్షలుగా మారి ఉండేది. గత నెల రోజుల్లో 70 శాతం రాబడిని అందించిన స్టాక్.. 2023 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 563 శాతం మేర లాభపడింది.
కంపెనీ వ్యాపారం గురించి పరిశీలిస్తే.. జై బాలాజీ ఇండస్ట్రీస్ ఇనుము, ఉక్కు ఉత్పత్తులను తయారీలో ఉంది. కంపెనీ జూన్ త్రైమాసికం అద్భుతమైన పనితీరును కనబరిచింది. 2023 ఏప్రిల్ నుంచి జూన్ వరకు పన్ను చెల్లింపు తర్వాత కంపెనీ లాభం రూ.170 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.21.82 కోట్లుగా ఉంది.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి, ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించండి.


Click it and Unblock the Notifications