అలీబాబా వ్యవస్థాపకులు జాక్ మా కీలక నిర్ణయం తీసుకున్నారు. సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ కార్పోరేషన్ డైరెక్టర్ బాధ్యతల నుండి తప్పుకుంటున్నారు. ఈ మేరకు జాక్ మా తన పదవికి రాజీనామా చేస్తున్నారని సాఫ్ట్ బ్యాంకు గ్రూప్ సోమవారం తెలిపింది. అదే విధంగా ముగ్గురు కొత్త సభ్యులను బోర్డులోకి ఆహ్వానించే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపింది.
జూన్ 25వ తేదీన జరిగే సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ కొత్త నియామకాలతో బోర్డు సభ్యుల సంఖ్య 13కు చేరుకుంటుందని తెలిపింది. వార్షిక సర్వ సభ్య సమావేశంలో గ్రూప్ సీఈవోతో సహా మూడు కొత్త నియామకాలను బోర్డుకు ప్రతిపాదిస్తామని సాఫ్ట్ బ్యాంక్ తెలిపింది. కాడెన్స్ డిజైన్స్ సిస్టమ్స్ సీఈవో లిప్ బూ టన్, వెసెడా బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ యూకో కవామోటో సభ్యులుగా చేరనున్నారు. కవామోటో బోర్డులో ఏకైక మహిళా సభ్యురాలు.

గత ఏడాది సెప్టెంబర్‌లో అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పదవీ విరమణ చేశారు. సేవా కార్యక్రమాల కోసం శేష జీవితాన్ని వినియోగించుకునేందుకు రాజీనామా చేసినట్లు తెలిపారు. ఇప్పుడు సాఫ్ట్ బ్యాంక్ బోర్డు సబ్యుడిగా కూడా వైదొలగుతున్నారు. మరోవైపు, షేర్ల కొనుగోలుకు దాదాపు 4.7 బిలియన్ డాలర్లు విడుదల చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు సాఫ్ట్ బ్యాంక్ వెల్లడించింది. అలీబాబాలో పెద్ద మొత్తంలో వాటాలు దక్కించుకునేందుకు సాఫ్ట్ బ్యాంకు ప్లాన్ చేస్తోంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications