For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జాక్‌మా, బిల్‌గేట్స్ భారీ సాయం, మీరేం చేస్తున్నారు.. భారత కుబేరులకు ప్రశ్నలు

|

కరోనాతో విలవిల్లాడుతున్న దక్షిణాసియా, తూర్పు ఆసియాలోని దేశాలకు ఆసియా కుబేరుడు, చైనా వ్యాపార దిగ్గజం జాక్ మా భారీ సాయాన్ని ప్రకటించారు. కరోనా నుండి ప్రజలకు కాపాడేందుకు 18 లక్షల మాస్క్‌లు, 2.1 లక్షల టెస్ట్ కిట్స్, 36 వేల ప్రొటెక్టివ్ సూట్స్ అందించనున్నట్లు జాక్ మా ట్వీట్ చేశారు. వీటిని అనుకున్నంత వేగంగా పంపిణీ చేయకపోవడం కుదరకపోవచ్చునని, కానీ ఇస్తామని జాక్ మా పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ కూడా బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా 100 మిలియన్ డాలర్ల సహకారం అందిస్తున్నారు. దీంతో నెటిజన్లు భారత కుబేరులను ప్రశ్నిస్తున్నారు.

సిలికాన్ వ్యాలీ షట్‌డౌన్: 35 ఏళ్ల తర్వాత తొలిసారి చర్చిల్సిలికాన్ వ్యాలీ షట్‌డౌన్: 35 ఏళ్ల తర్వాత తొలిసారి చర్చిల్

ఇండియా బిలియనీర్లు ఎక్కడ?

ఇండియన్ బిలియనీర్స్ ఎక్కడ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇటలీలో కరోనాపై పోరాడేందుకు 18 మంది బిలియనీర్లు 28 మిలియన్ డాలర్లు అందించారని, బిల్ గేట్స్, జాక్ మా, లి కా షింగ్ వంటి వారు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారని, కానీ ఇండియాలో 138 మంది బిలియనీర్లు ఉండి ఏమీ చేయడం లేదని, బాల్కనీలో నిలబడి చప్పట్లు కొడుతున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించారు.

నెటిజన్ వర్సెస్ నెటిజన్

ఓ నెటిజన్ ఇండియా మినహా మిగతా చుట్టుపక్కల దేశాలకు జాక్ మా మాస్క్‌లు, గ్లౌవ్స్, పంపిస్తున్నారని, ఇలాంటి సంబంధాలు కలిగి ఉన్నందుకు థ్యాంక్స్ మోడీజీ అని ఎద్దేవా చేశారు. దీనికి మరో నెటిజన్ దీటైన కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు భారత్ గతంలో వలె ఇతరుల కోసం (ఇతర దేశాలు) ఎదురు చూసే పరిస్థితుల్లో లేదని, అలా ఎదురు చూసే రోజులు పోయాయని, సొంతగా డీల్ చేసుకుంటోందని కౌంటర్ ఇచ్చారు.

చైనాకు సరఫరా..

ఇండియా రూ.2.11 కోట్ల విలువ కలిగిన 15 టన్నుల మెడికల్ పరికరాలను కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ప్రభావానికి గురైన చైనాకు పంపించినట్లు ప్రభుత్వం పేర్కొన్న వార్తను మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

English summary

జాక్‌మా, బిల్‌గేట్స్ భారీ సాయం, మీరేం చేస్తున్నారు.. భారత కుబేరులకు ప్రశ్నలు | Jack Ma donate while Indian rich clap balconies

Bill Gates, the world's second richest person, has committed $100 million through the Bill and Melinda Gates Foundation to aid global research and treatment of the coronavirus.
Story first published: Sunday, March 22, 2020, 8:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X