నేడు శుక్రవారం ఉదయం స్టాక్ మార్కెట్ రెడ్ మార్కీలో ప్రారంభమైంది. దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 1% పైగా పడిపోయాయి. మరోవైపు గత నెల నవంబర్‌లో గ్రామీణ, పట్టణ ద్రవ్యోల్బణం పెరగడం షేర్ మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. ఉదయం 10:35 గంటల సమయానికి బిఎస్‌ఇ సెన్సెక్స్ 1,147 పాయింట్లు (1.41%) క్షీణించి 80,142 వద్ద, నిఫ్టీ 50 337 పాయింట్లు (1.37%) పడిపోయి 24,211 వద్ద ఉన్నాయి. BSEలో అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6.5 లక్షల కోట్లు తగ్గి రూ.451.65 లక్షల కోట్లకు చేరుకుంది.
నిఫ్టీ మెటల్ స్టాక్స్ 5% వరకు క్షీణించాయి. మరోవైపు నిఫ్టీ బ్యాంక్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ కూడా 1.5% నుంచి 2.7% వరకు క్షీణించాయి. ఫియర్ గేజ్, ఇండియా VIX 9.9% పెరిగి 14.5కి చేరుకుంది.

నిన్న గురువారం స్టాక్ మార్కెట్ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ) సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఇ) నిఫ్టీ రెండూ నష్టాల్లో ముగిశాయి. మరోవైపు ఈ వారం చివరి రోజున శుక్రవారం షేర్ మార్కెట్‌లో కొన్ని స్టాక్‌లు పెరుగుతాయని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
HAL
రక్షణ రంగ దిగ్గజం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఆర్డర్ బుక్ మరింత బలపడింది. కంపెనీకి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి పెద్ద ఆర్డర్ వచ్చింది. భారత వైమానిక దళం కోసం 12 Su-30MKI (సుఖోయ్-30) యుద్ధ విమానాల కోసం రక్షణ మంత్రిత్వ శాఖతో దిల్ కుదుర్చుకున్నట్లు HAL తెలిపింది. ఈ ఆర్డర్ విలువ రూ.13,500 కోట్లు. నిన్న షేర్ మార్కెట్‌లో హెచ్‌ఏఎల్ షేర్లు లాభాలతో రూ.4,659 వద్ద ముగిశాయి. 2024లో ఇప్పటివరకు పెట్టుబడిదారులకు 64.84% అద్భుతమైన రాబడిని అందించింది.
అశోక్‌లేలాండ్
ప్రముఖ వాహన కంపెనీ అశోక్ లేలాండ్ భారీ ఆర్డర్ అందుకుంది. ప్యాసింజర్ బస్ ఛాసిస్ సప్లయ్ కోసం తమిళనాడు స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ నుండి కంపెనీ రూ.345.58 కోట్ల విలువైన ఆర్డర్‌ను పొందింది. ఈ వార్త ప్రభావం కూడా కంపెనీ షేర్లపై కనిపిస్తోంది. నిన్న కంపెనీ షేరు పడిపోయి రూ.230 వద్ద క్లోజ్ అయ్యింది.
టాటా మోటార్స్
టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల ధరలను పెంచబోతోంది. జనవరి 2025 నుండి వాణిజ్య వాహనాల ధరలను 2% పెంచనున్నట్లు నిన్న స్టాక్ మార్కెట్ ముగిసిన తర్వాత కంపెనీ తెలిపింది. గురువారం టాటా మోటార్స్ షేర్లలో దాదాపు ఒకటిన్నర శాతం పడిపోగా షేర్ ధర రూ.787తో ఇప్పటి వరకు 0.46% పడిపోయింది.
NESCO Ltd
200 కోట్ల విలువైన కాంట్రాక్టు పొందినట్టు నెస్కో లిమిటెడ్ తాజాగా తెలిపింది. ఈ ఆర్డర్ హైదరాబాద్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌వేకు సంబంధించినది. నిన్న కూడా కంపెనీ షేర్లు నష్టాల్లోనే కొనసాగగా రూ.1,015.50 ధరతో ఈ షేరు ఇప్పటివరకు ఇన్వెస్టర్లకు 13.92% రిటర్న్ ఇచ్చింది.
యస్ బ్యాంక్
ప్రైవేట్ రంగ యెస్ బ్యాంక్ మేనేజ్మెంట్ మార్పులను తెలిపింది. మనీష్ జైన్‌ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇడి)గా నియమించినట్లు బ్యాంక్ ఎక్స్ఛేంజ్‌కు తెలిపింది. అతని పదవీకాలం 3 సంవత్సరాలు ఉండగా యస్ బ్యాంకు షేర్లు నిన్న పతనమై రూ.21.24 వద్ద క్లోజ్ అయ్యాయి.
More From GoodReturns

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్‌లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications