ఇంకా మీకు రీఫండ్ రాలేదా.. అయితే ఈ తప్పు జరిగి ఉంటుంది.. వెంటనే ఇలా చెక్ చేసుకోండి
ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ITR) దాఖలు చేసే గడువు సెప్టెంబర్ 16తో ముగిసింది. చాలా మంది పన్ను చెల్లింపుదారులు తమ రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు. సాధారణంగా, ITR ఫైలింగ్ పూర్తయి, ఇ-వెరిఫికేషన్ జరిగిన తర్వాత, రీఫండ్ మొత్తం 2 నుండి 5 వారాల మధ్యలో బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. కానీ కొందరికి ఆలస్యం కావడం సహజమే. ఇలాంటి సందర్భంలో, దానికి కారణమేమిటో తెలుసుకోవడం ముఖ్యం.
మీరు రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత.. దానిని ఇ-వెరిఫై చేయడం చాలా అవసరం. ఇ-వెరిఫికేషన్ పూర్తికాకపోతే, ఆదాయపు పన్ను శాఖ రీఫండ్ ప్రాసెసింగ్ ప్రారంభించదు. మీరు ఇ-వెరిఫై చేయడం మర్చిపోయి ఉంటే, వెంటనే ఆదాయపు పన్ను వెబ్‌సైట్ (incometax.gov.in) లో లాగిన్ అయి, ఆధార్ OTP, నెట్ బ్యాంకింగ్ లేదా డిజిటల్ సిగ్నేచర్ ద్వారా ధృవీకరించాలి.

ఆదాయపు పన్ను రీఫండ్ ఆలస్యం కావడానికి అనేక కారణాలు ఉంటాయి:
బ్యాంక్ ఖాతా ప్రీ-వెరిఫై చేయకపోవడం
పాన్ కార్డు, బ్యాంక్ వివరాల్లో పేరు భిన్నత ఉండటం
IFSC కోడ్ తప్పుగా నమోదు కావడం
ITRలో పేర్కొన్న ఖాతా మూసివేయబడడం
పాన్ కార్డు ఆధార్‌తో లింక్ కాకపోవడం.. ఈ లోపాలు ఉన్నట్లయితే, రీఫండ్ ప్రాసెసింగ్ ఆగిపోతుంది.
రీఫండ్ స్టేటస్‌ను ఎలా చెక్ చేయాలి
1. incometax.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వండి.
2. e-File ట్యాబ్‌లోకి వెళ్లి View Filed Returns ఎంచుకోండి.
3. అక్కడ మీ ITR వివరాలు, ప్రాసెసింగ్ స్థితి రిఫండ్ వివరాలు కనిపిస్తాయి.
4. Refund Issued అని చూపితే, అది బ్యాంక్‌కు పంపబడింది.Refund Failed అయితే, ఖాతా వివరాలు లేదా IFSC కోడ్‌ను సరిచూడాలి.
ఎంతకాలం లోపల రీఫండ్ వస్తుంది? ఇ-వెరిఫికేషన్ తర్వాత సాధారణంగా 4-5 వారాలలోపు రీఫండ్ జమ అవుతుంది. కానీ రిటర్న్‌లో వ్యాపార ఆదాయం, మూలధన లాభాలు లేదా క్లిష్టమైన తగ్గింపులు ఉంటే, ప్రాసెసింగ్‌కు ఎక్కువ సమయం పట్టవచ్చు. కొన్ని కేసుల్లో, ఆటోమేటిక్ వెరిఫికేషన్ కోసం రీఫండ్ ఆలస్యం అవుతుంది. రూ. 50 వేల కంటే ఎక్కువ రీఫండ్‌లు సాధారణంగా ప్రత్యేక పరిశీలనకు లోబడి ఉంటాయి. అయితే, రీఫండ్ మొత్తంపై ఎటువంటి పరిమితి లేదు. ఎక్కువ రీఫండ్ ఆలస్యం అయితే, ఆ మొత్తంపై నెలకు 0.5 శాతం వడ్డీ రేటుతో ఆదాయపు పన్ను శాఖ అదనపు వడ్డీ చెల్లిస్తుంది.
మీ రీఫండ్ నిరవధికంగా పెండింగ్‌లో ఉంటే: CPC Bengaluru లేదా Income Tax Grievance Portal ద్వారా ఫిర్యాదు నమోదు చేయండి. NSDL Refund Status Page (tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.html) ద్వారా కూడా రీఫండ్ వివరాలు తెలుసుకోవచ్చు.
మీ ITR రీఫండ్ రాలేదంటే.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మొదట మీరు ఇ-వెరిఫికేషన్ పూర్తి చేశారో లేదో తనిఖీ చేయండి. తర్వాత బ్యాంక్ ఖాతా, IFSC, పాన్-ఆధార్ లింక్ స్టేటస్ వంటి వివరాలు సరిచూడండి. అన్ని సరిగా ఉంటే, సాధారణంగా మీ రీఫండ్ త్వరలోనే వస్తుంది.


Click it and Unblock the Notifications