ITR Refund: 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ (ITR) ఈ సారి చాలా లేట్ అయినట్టు కనిపిస్తుంది. గడువుకు చాలా నెలల ముందే ఫైల్ చేసినా చాలామంది ఇప్పటికీ తమ రిఫండ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతకీ రిఫండ్ ఆలస్యానికి కారణమేంటి? రీఫండ్ ఎప్పుడు వస్తుంది?
ఆలస్యానికి కారణం ఇదే..
సాధారణంగా ITR ఫైలింగ్, వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత రిఫండ్ క్రెడిట్ కావడానికి 4-5 వారాల సమయం పడుతుంది. అయితే ఈసారి హైవాల్యూ ITR ఫైలింగ్‌ల వల్ల రీఫండ్ ఆలస్యమైందని ఐటీ శాఖ చెప్తోంది. CBDT ఛైర్మన్ రవి అగర్వాల్ ప్రకారం ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖ ప్రస్తుతం కొన్ని "రెడ్-ఫ్లాగ్" అయిన రిఫండ్ క్లెయిమ్‌లను నిశితంగా పరిశీలిస్తోంది. తప్పుగా క్లెయిమ్ చేసిన కేసులను గుర్తించి, వాటిని విశ్లేషిస్తోంది. ఏదైనా పొరపాటు జరగకుండా ఉండేందుకు ఈ ప్రక్రియలో ఐటీ శాఖ చాలా జాగ్రత్త వహిస్తోంది.

ITR అంటే ఏంటి?
ట్యాక్స్ పేయర్లు ఏడాది మొత్తంలో కట్టిన పన్ను.. కట్టాల్సిన పన్ను కంటే ఎక్కువగా ఆ మిగిలిన మొత్తాన్ని ఐటీ శాఖ రీఫండ్ చేస్తుంది. అంటే TDS/TCS/అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో కట్టిన పన్ను అసలు పన్ను (Actual Tax Due) కంటే ఎక్కువగా ఉంటే ఆ అదనపు మొత్తాన్ని ఆదాయపు పన్ను శాఖ తిరిగి చెల్లిస్తుంది.
ఎప్పుడు వస్తుందంటే..
CBDT ఛైర్మన్ ప్రకారం చట్టబద్ధంగా చెల్లించాల్సిన రిఫండ్‌లు డిసెంబర్ నాటికి జారీ అయ్యేఅవకాశం ఉంది. ఇక చిన్న రిఫండ్‌లు, తక్కువ-విలువ గల ITR రిఫండ్‌లను ఇప్పటికే విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు. అయితే ట్యాక్స్ పేయర్లు తమ పాన్ కార్డు (PAN Card) ద్వారా ఆన్‌లైన్‌లో రిఫండ్ స్టేటస్‌ను ఎప్పుడైనా తనిఖీ చేసుకోవచ్చు. ఒకవేళ ఆధార్-పాన్ లింక్ చేయకపోయినా లేదా మీ బ్యాంక్ అకౌంట్ ను ప్రీ-వాలిడేట్ చేయకపోయినా కూడా రీఫండ్ రాదు.
రిఫండ్ స్టేటస్ ఎలా చూడాలి?
- ట్యాక్స్ పేయర్లు ఇఫైలింగ్ పోర్టల్‌లో రిఫండ్ స్టేటస్‌ను చెక్ చేయొచ్చు.
- ముందుగా ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ హోమ్‌పేజీకి వెళ్లాలి.
- అక్కడ మీ యూజర్ ID (పాన్ నంబర్), పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. తర్వత e-File ట్యాబ్‌కు వెళ్లాలి.
- ఆపై Income Tax Returns > View Filed Returns ను ఎంచుకోవాలి.
- అక్కడ అక్కడ మీరు కోరుకున్న అసెస్‌మెంట్ ఇయర్‌ను (Assessment Year) ఎంచుకుని, దాని రిఫండ్ స్టేటస్‌ను చూడవచ్చు.
- View Details పై క్లిక్ చేయడం ద్వారా ITR యొక్క లైఫ్ సైకిల్‌ను కూడా చూడవచ్చు.
- Refund is issued అని ఉంటే రీఫండ్ జారీ చేయబడిందని అర్థం.
- Refund is partially adjusted అని ఉంటే రీఫండ్ లో కొంతమొత్తం జారీ చేయబడినట్టు లెక్క.
- Full refund adjusted అని ఉంటే మీ రీఫండ్ మొత్తం జారీ చేయబడిందని అర్థం.
- ఇక Refund is failed అని ఉంటే మీ రీఫండ్ ఫెయిల్ అయినట్టు.
- ఒకవేళ రిఫండ్ ఫెయిల్ అయితే మీరు పోర్టల్‌లో సర్వీస్ రిక్వెస్ట్ (Service Request) పెట్టొచ్చు.
- Services మెనూకు వెళ్లి అక్కడ 'Refund Reissue' పై క్లిక్ చేసి.. Refund Reissue Request ను క్రియేట్ చేయాలి. అక్కడ రీఇష్యూ కోసం దరఖాస్తు చేయవచ్చు.


Click it and Unblock the Notifications