న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం సమీపించింది. ఇంకొక్క రోజే మిగిలివుంది. డిసెంబర్ 31వ తేదీ నాటికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం కూడా పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో- కొన్ని డెడ్‌లైన్స్ కూడా ముగింపుకొచ్చేశాయి. ఇందులో కీలకమైనది.. కోట్లాదిమంది పన్ను చెల్లింపుదారులతో ముడిపడి ఉన్నదీ.. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నుల దాఖలు గడువు. శుక్రవారంలోగా ఐటీ రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంది.
ఈ పరిస్థితుల్లో ఐటీఆర్ ఫైలింగ్స్‌కు సంబంధించిన పోర్టల్ ఒక్కసారిగా స్లో డౌన్ అయింది. సర్వర్ స్తంభించిపోయింది. ఐటీఆర్ ఫైలింగ్స్ అప్‌లోడ్ చేయలేకపోతోన్నారు పన్ను చెల్లింపుదారులు. తమ వివరాలను అప్‌లోడ్ చేసిన ప్రతీసారీ ఎర్రర్ అంటూ చూపిస్తోంది. ఐటీఆర్ ఫైలింగ్స్‌కు గడువు సమీపిస్తోండటం, పోర్టల్ స్తంభించిపోతుండటంతో ట్యాక్స్ పేయర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తుది గడువును పొడిగించాలంటూ డిమాండ్ చేస్తోన్నారు.
తమ డిమాండ్‌ను సోషల్ మీడియా ద్వారా కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోన్నారు. #Extend_Due_Date_Immediately అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులు తక్షణమే దీనిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తోన్నారు. వివరాలను అప్‌లోడ్ చేయడంలో గంటల కొద్దీ సమయం పడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు. దీనికి సంబంధించిన కంప్యూటర్ స్క్రీన్ షాట్లను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోన్నారు.

కొత్త ఐటీఆర్ ఫైలింగ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటి నుంచీ ఈ ఇబ్బందులు తలెత్తుతూనే వస్తోన్నాయి. ఇదివరకు అనేక ఎర్రర్‌లు చోటు చేసుకున్నాయి. ఫలితంగా- ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు ట్యాక్స్ పేయర్లపై విధించిన జరిమానాను వెనక్కి చెల్లించాల్సి వచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) అధికారులు ప్రతి నెల కూడా ఈ జరిమానాల రూపంలో విధించిన మొత్తాన్ని చెల్లిస్తూ వస్తోన్నారు.
కాగా ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తట్లేదనే విషయాన్ని సీబీడీటీ స్పష్టం చేస్తోంది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. బుధవారం నాటికి 5,09,58,559 ఫైలింగ్స్ నమోదైనట్లు తెలిపింది. ఇందులో 23,24,253 ఫైలింగ్స్ ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిని. దీన్ని బట్టి చూస్తోంటే- ఐటీఆర్ ఫైలింగ్స్ గడువు పెంచకపోవచ్చనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. ఇంతకుముందే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ఫైలింగ్స్ గడువును డిసెంబర్ 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు పొడిగించింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications