కరోనా నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ఊరట కల్పించింది. fy21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్స్ గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది. అయితే గడువు పొడిగించినప్పటికీ అంతకుముందు ఉన్న జరిమానా వడ్డీ ఛార్జీలను యథావిధిగా చెల్లించవలసి ఉంటుంది. వాటిపై ఎలాంటి మినహాయింపు లేదని తెలిపింది. వివిధ ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ల కింద ఆలస్య చెల్లింపులకు గాను వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
ఐటీఆర్ దాఖలులో ఆలస్యమైతే సెక్షన్ 234ఎ కింద వడ్డీ వర్తిస్తుంది. ఐటీఆర్ ఫైలింగ్ డెడ్ లైన్ జులై 31, 2021 అనుకుంటే ఆగస్ట్ ఐదో రోజు ఐటీఆర్ దాఖలు చేస్తే, చెల్లించాల్సిన మొత్తం పన్నుపై నెలకు ఒక శాతం చొప్పున వడ్డీ ఉంటుంది. ఇక్కడ ఒక నెల దాటి మరో నెలలో ఐదు రోజులే అయినప్పటికీ, దాని మొత్తం నెలగా భావిస్తారు. అందుకే పూర్తిగా నెలరోజుల వడ్డీ వర్తింపచేస్తారు. అయితే గత సంవత్సరం మాదిరి ప్రభుత్వం ఈ వడ్డీ విషయంలో కొంత మినహాయింపు ఇచ్చింది.

చెల్లించాల్సిన పన్ను మొత్తం రూ.లక్ష లోపు ఉంటే ఇది వర్తించదు. రూ.లక్ష కంటే ఎక్కువగా ఉంటే వర్తిస్తుంది. అంటే వారికి ఇప్పుడు సెప్టెంబర్ 30 వరకు సమయం ఉంటుంది. అయితే ఆగస్ట, సెప్టెంబర్ నెలలకు ఒక శాతం చొప్పున వడ్డీ చెల్లించాలి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications