ఈసారి ITR ఫైలింగ్‌లో 5 బిగ్ చేంజెస్.. ఆ తప్పులు చేస్తే పన్ను నోటీసులు గ్యారెంటీ!
ప్రతి సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) ఫైల్ చేయడం అనేది ఒక ముఖ్యమైన పని. అయితే, ఈ ఏడాది ఐటీఆర్ ఫైలింగ్ ప్రాసెస్ పాత పద్ధతిలోనే కనిపిస్తున్నప్పటికీ.. లోపల కొన్ని కీలకమైన రూల్స్ మారిపోయాయి. అసెస్‌మెంట్ ఇయర్ (AY) 2026-27 కు సంబంధించి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఇప్పటికే ఆన్‌లైన్ ఫైలింగ్ సదుపాయాన్ని, ఐటీఆర్-1, ఐటీఆర్-4 ఎక్సెల్ యుటిలిటీలను అందుబాటులోకి తెచ్చింది. చాలా మంది ఉద్యోగులు తమ కంపెనీల నుండి 'ఫామ్ 16' రాకముందే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ, ఈసారి ఫామ్స్‌లో వచ్చిన 5 ముఖ్యమైన మార్పుల గురించి తెలుసుకోకపోతే మాత్రం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఈ 5 మార్పులను కచ్చితంగా మైండ్‌లో పెట్టుకోవాలి.

1. రెండు ఇళ్లు ఉన్నవారికి పెద్ద ఉపశమనం!
గతంలో జీతం వచ్చే ఉద్యోగులు ఒకటి కంటే ఎక్కువ ఇళ్లు ఉండి, వాటి ద్వారా ఆదాయం వస్తుంటే.. సింపుల్‌గా ఉండే ఐటీఆర్-1 (సహజ్) లేదా చిన్న వ్యాపారస్తులు ఐటీఆర్-4 (సుగమ్) ఫామ్స్ వాడటానికి కుదిరేది కాదు. వారు మరింత కాంప్లికేటెడ్ ఫామ్స్ వైపు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఈసారి నిబంధనలను సడలించారు. ఇప్పుడు రెండు నివాస గృహాల (House Properties) నుండి వచ్చే ఆదాయాన్ని కూడా ఐటీఆర్-1, ఐటీఆర్-4 ఫామ్స్‌లోనే ఈజీగా చూపించుకోవచ్చు. దీనివల్ల చాలా మందికి శ్రమ తప్పుతుంది.
2. క్యాపిటల్ గెయిన్స్ రిపోర్టింగ్ ఇక ఈజీ!
గతేడాది బడ్జెట్ మార్పుల వల్ల షేర్లు లేదా ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చిన లాభాలను (Capital Gains) జూలై 23 కంటే ముందు, ఆ తర్వాత అని డేట్ల వారీగా విడదీసి చూపించాల్సి వచ్చేది. ఇది ట్రేడర్లను, ఇన్వెస్టర్లను బాగా కన్ఫ్యూజ్ చేసింది. అయితే ఈ సంవత్సరం ఆ పాత రిపోర్టింగ్ ఫీల్డ్‌లను ఐటీఆర్ (ITR) ఫామ్స్ నుండి తొలగించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఒకే రకమైన పన్ను నిర్మాణం ఉండటం వల్ల.. తేదీల ప్రకారం లావాదేవీలను విడదీయాల్సిన అవసరం లేదు. దీనివల్ల క్యాపిటల్ గెయిన్స్ లెక్కలు చాలా సింపుల్ అయిపోతాయి.
3. రాని అద్దెకు (Unrealised Rent) కొత్త కాలమ్!
ఇళ్లను అద్దెకు ఇచ్చే ల్యాండ్‌లార్డ్స్ కోసం ఒక కొత్త నిబంధన వచ్చింది. టెనెంట్స్ (అద్దెదారులు) నుండి వసూలు చేయలేకపోయిన రెంట్ లేదా మునిగిపోయిన అద్దె వివరాలను తెలపడానికి ఐటీఆర్-1, ఐటీఆర్-4 ఫామ్స్‌లో ఒక ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేశారు. దీనివల్ల మీ అద్దె ఆదాయంపై పారదర్శకత పెరుగుతుంది.
4. బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పడం ఇక కంపల్సరీ!
చిన్న వ్యాపారాలు, ఫ్రీలాన్సర్లు ఉపయోగించే ప్రిజంప్టివ్ టాక్సేషన్ స్కీమ్స్ (సెక్షన్ 44AD, 44ADA, 44AE) కింద ఐటీఆర్-4 ఫైల్ చేసే వారు ఇకపై జాగ్రత్తగా ఉండాలి. మార్చి 31, 2026 నాటికి మీ పేరు మీద యాక్టివ్‌గా ఉన్న అన్ని బ్యాంక్ అకౌంట్లలోని టోటల్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంతో ఐటీఆర్ ఫామ్‌లోని E21 ఫీల్డ్‌లో కచ్చితంగా నమోదు చేయాలి. ఇందులో తప్పులు దొర్లితే ఐటీ శాఖ నుండి నోటీసులు వచ్చే ఛాన్స్ ఉంది.
5. కరెక్ట్ ఫామ్ ఎంచుకోకపోతే కష్టమే!
మీకు శాలరీతో పాటు బిజినెస్ ఆదాయం, షేర్ మార్కెట్ ట్రేడింగ్ లేదా అద్దె ద్వారా మల్టిపుల్ ఆదాయాలు ఉంటే.. ఏ ఐటీఆర్ (ITR) ఫామ్ మీకు సూట్ అవుతుందో ముందే క్లారిటీ తెచ్చుకోండి. తప్పుడు ఫామ్ సబ్మిట్ చేస్తే డిఫెక్టివ్ రిటర్న్ నోటీసులు రావడం, రీఫండ్‌లు ఆలస్యం అవ్వడం లేదా లాస్‌లను క్యారీ ఫార్వర్డ్ చేసుకునే అవకాశం కోల్పోవడం వంటి నష్టాలు జరుగుతాయి. కాబట్టి ఫామ్ 16 వచ్చేలోపు మీ బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఇన్వెస్ట్‌మెంట్ ప్రూఫ్‌లను ఒకసారి చెక్ చేసుకుని ఆచి తూచి అడుగు వేయండి!


Click it and Unblock the Notifications