ITR ఫైలింగ్ 2026: ఇకపై ఫామ్ 26AS చెల్లదు! అమల్లోకి వచ్చిన కొత్త ఫామ్ 168 గురించి మీకు తెలుసా?

ప్రతి సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేసే టాక్స్ పేయర్స్ అందరికీ 'ఫామ్ 26AS' (Form 26AS) గురించి బాగా తెలిసే ఉంటుంది. మీ పాన్ (PAN) కార్డ్‌పై ఎంత టాక్స్ కట్ అయింది, ఎంత డిపాజిట్ అయింది అని చూపే వార్షిక టాక్స్ క్రెడిట్ స్టేట్‌మెంట్ ఇది. అయితే, కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు 2026 ప్రకారం.. ఆదాయపు పన్ను శాఖ ఈ పాత ఫామ్‌ను రద్దు చేసి, దీని స్థానంలో మరింత సమాచారంతో కూడిన కొత్త Form 168 ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది ఐటీఆర్ ఫైల్ చేసే కంటే ముందే ఈ కొత్త మార్పుల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.

ITR Filing 2026 Form 26AS Replaced By Form 168 Income Tax Return New Rules PAN Card News

అసలు ఫామ్ 168 (Form 168) అంటే ఏమిటి?

ఆదాయపు పన్ను నిబంధనలు 2026 లోని రూల్ 245 కింద ఈ కొత్త ఫామ్‌ను నోటిఫై చేశారు. ఇది కేవలం మీ టాక్స్ వివరాలు మాత్రమే కాకుండా.. ఒక ట్యాక్స్ పేయర్ పాన్ కార్డ్‌కు లింక్ అయి ఉన్న అన్ని రకాల ఆర్థిక లావాదేవీలను చూపే ఒక సమగ్రమైన యాన్యువల్ స్టేట్‌మెంట్. ట్యాక్స్ పేయర్స్ , ఐటీ డిపార్ట్‌మెంట్ ఇద్దరికీ డేటా కచ్చితత్వాన్ని, పారదర్శకతను పెంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇందులో ప్రధానంగా కింది వివరాలు ఉంటాయి..

• సోర్స్ వద్ద కట్ అయిన పన్ను (TDS) , వసూలు చేసిన పన్ను (TCS) వివరాలు

• మీరు కట్టిన అడ్వాన్స్ టాక్స్, సెల్ఫ్ అసెస్‌మెంట్ టాక్స్ పేమెంట్లు

• నిర్దేశిత ఆర్థిక లావాదేవీలు (Specified Financial Transactions - SFT)

• మీకు రావాల్సిన టాక్స్ రీఫండ్ లేదా మీరు ప్రభుత్వానికి కట్టాల్సిన టాక్స్ డిమాండ్ వివరాలు

• మీపై ఉన్న పెండింగ్ లేదా పూర్తయిన ఐటీ శాఖ విచారణల (Proceedings) స్టేటస్

ఈ కొత్త ఫామ్ నిర్మాణం ఎలా ఉంటుంది?

ఈ Form 168 ను రెండు భాగాలుగా విభజించారు. 'పార్ట్-ఎ' (Part A) లో మీ పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, పాన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ , మొబైల్ నెంబర్ ఉంటాయి. ఇక 'పార్ట్-బి' (Part B) లో మీ టీడీఎస్, టీసీఎస్, టాక్స్ పేమెంట్లు, రీఫండ్లు, , పెండింగ్ ప్రొసీడింగ్స్‌కు సంబంధించిన పూర్తి కమర్షియల్ సమాచారం రికార్డ్ అయి ఉంటుంది.

దీనిని ఎవరు ఫైల్ చేయాలి?

ఈ ఫామ్‌ను కస్టమర్లు లేదా ట్యాక్స్ పేయర్స్ మాన్యువల్‌గా ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. మీ శాలరీ నుండి టాక్స్ కట్ చేసే కంపెనీలు, బ్యాంకులు , ఇతర ఆర్థిక సంస్థలు ఐటీ శాఖకు సబ్మిట్ చేసే పీరియాడిక్ రిటర్న్స్ ఆధారంగా ఐటీ డిపార్ట్‌మెంటే ఈ ఫామ్‌ను ఆటోమేటిక్‌గా జనరేట్ చేస్తుంది.

ఐటీఆర్ (ITR) వేసే ముందు దీనిని ఎందుకు చెక్ చేయాలి?

మీరు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు మీ దగ్గర ఉన్న లెక్కలు, ఐటీ డిపార్ట్‌మెంట్ రికార్డులతో సరిగ్గా మ్యాచ్ అవ్వాలి. లేదంటే ఐటీ నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ కొత్త ఫామ్‌ను ముందుగానే చెక్ చేసుకోవడం వల్ల మీ ఆదాయ వనరులన్నీ ఐటీఆర్‌లో కరెక్ట్‌గా చూపించామా లేదా అనేది స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాదు, మీ కంపెనీ కట్ చేసిన టాక్స్ నిజంగానే ప్రభుత్వానికి డిపాజిట్ అయిందో లేదో ఇందులో క్లియర్ గా కనిపిస్తుంది. ఈ స్టేట్‌మెంట్‌లో సక్సెస్‌ఫుల్‌గా రిఫ్లెక్ట్ అయిన టాక్స్ క్రెడిట్‌ను మాత్రమే మీరు క్లెయిమ్ చేసుకోగలరు. ఒకవేళ ఏవైనా తప్పులుంటే, ఐటీఆర్ వేయడానికి ముందే మీ డిడక్టర్‌ను సంప్రదించి సవరించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి ITR ఫైల్ చేసేటప్పుడు పొరపాట్లకు తావులేకుండా ఈ కొత్త ఫామ్‌ను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+