ట్యాక్స్ సున్నా ఉన్నా సరే.. లాస్ట్ డేట్ దాటితే పెనాల్టీ తప్పదు! ఐటీ డిపార్ట్‌మెంట్ కొత్త రూల్స్ ఇవే!
ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన పని ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) ఫైల్ చేయడం. చాలా మంది చివరి నిమిషం వరకు వేచి చూసి, ఆ హడావిడిలో తప్పులు చేస్తుంటారు. దీనివల్ల రీఫండ్‌లు రిజెక్ట్ అవ్వడమే కాకుండా, ఆదాయ పన్ను శాఖ (Income Tax Department) నుండి నోటీసులు, పెనాల్టీలు వచ్చే ప్రమాదం ఉంది. ఒకవేళ మీరు నిర్ణీత గడువులోగా మీ ITR దాఖలు చేయకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు చూద్దాం.
ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 234F ప్రకారం, డెడ్‌లైన్ మిస్ అయితే లేట్ ఫైలింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మీ వార్షిక ఆదాయం , ఆలస్యమైన గడువును బట్టి ఈ పెనాల్టీ మారుతుంది. మీ మొత్తం ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే గరిష్టంగా రూ.1,000 పెనాల్టీ పడుతుంది. అదే మీ ఆదాయం రూ.5 లక్షలు దాటితే మాత్రం ఏకంగా రూ.5,000 వరకు ఫైన్ కట్టాల్సి వస్తుంది.

ట్యాక్స్ సున్నా ఉన్నా ఫైన్ పడుతుందా?
చాలా మందికి వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే.. "మాకు ఎలాగో ట్యాక్స్ మినహాయింపులు ఉన్నాయి, మా ట్యాక్స్ లయబిలిటీ సున్నా (Zero), మరి మేము లేట్‌గా ఫైల్ చేసినా ఫైన్ పడుతుందా?" అని. అవును, ఖచ్చితంగా పడుతుంది!
జీతం తీసుకునే ఉద్యోగులు జూలై 31, 2026 డెడ్‌లైన్ మిస్ అయితే, డిసెంబర్ 31, 2026 లోపు 'బిలేటెడ్ రిటర్న్' (Belated Return) దాఖలు చేయవచ్చు. కానీ, ఎగ్జెంప్షన్స్ లేదా రీబేట్స్ వల్ల మీ ట్యాక్స్ సున్నా అయినా సరే, లేట్ ఫీజు మాత్రం కట్టాల్సిందే. కేవలం ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి మాత్రమే ITR ఫైలింగ్ తప్పనిసరి కాదు. పాత పన్ను విధానంలో ఈ పరిమితి రూ.2.5 లక్షలు కాగా, కొత్త పన్ను విధానంలో రూ.4 లక్షలుగా ఉంది.
ఉదాహరణకు, ఒక వ్యక్తి ఆదాయం రూ.9 లక్షలు అనుకుందాం. అతడు జూలై 31 లోపు ఫైల్ చేయకుండా నవంబర్ 2026 లో ఫైల్ చేస్తే, ట్యాక్స్ క్లియర్ అయినా సరే రూ.5,000 లేట్ ఫీజు కట్టాలి. దీనితో పాటు గడువు దాటిన తర్వాత మిగిలి ఉన్న పన్ను మొత్తంపై వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.
వివిధ కేటగిరీల డెడ్‌లైన్స్ ఇవే
ఆదాయ పన్ను శాఖ వేర్వేరు పన్ను చెల్లింపుదారులకు వేర్వేరు గడువులను నిర్ణయించింది..
- జూలై 31: సాధారణ జీతగాళ్లు, ITR-1 లేదా ITR-2 ఫైల్ చేసేవారికి ఇదే ఆఖరి తేదీ.
- ఆగస్టు 31: ట్యాక్స్ ఆడిట్ అవసరం లేని , ITR-3 లేదా ITR-4 ఫైల్ చేసే వ్యాపారవేత్తలకు గడువు.
- అక్టోబర్ 31: చట్టబద్ధంగా ట్యాక్స్ ఆడిట్ తప్పనిసరి అయిన అకౌంట్స్ ఉన్నవారికి లాస్ట్ డేట్.
- నవంబర్ 30: ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ నిబంధనల పరిధిలోకి వచ్చే వారికి చివరి తేదీ.
ఒకవేళ ఈ తేదీలు మిస్ అయినా డిసెంబర్ 31 లోపు బిలేటెడ్ రిటర్న్ వేసుకోవచ్చు. అలాగే చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ మార్చి 31, 2027 లోపు 'రివైజ్డ్ రిటర్న్' (Revised Return) దాఖలు చేసే అవకాశం కూడా ఉంటుంది.
చివరి నిమిషంలో టెన్షన్ పడకుండా, అదనపు పెనాల్టీలు , వడ్డీల భారం పడకుండా ఉండాలంటే గడువులోపలే మీ ITR ఫైలింగ్ పూర్తి చేయడం ఉత్తమం. ముందే ప్లాన్ చేసుకుంటే తప్పులు లేకుండా ప్రశాంతంగా ట్యాక్స్ ప్రక్రియను


Click it and Unblock the Notifications