కొత్త ఆర్థిక సంవత్సరం 1 ఏప్రిల్ నుండి ప్రారంభమవుతుంది. దింతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులు గత ఏడాదికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయాలని చూస్తుంటారు. ఇందుకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి (AY 2025-26) ITR ఫామ్‌ను CBDT జారీ చేసింది. అంటే ఐటీఆర్-1 అండ్ ఐటీఆర్-4 అందుబాటులోకి వచ్చింది. కానీ ఈసారి రిటర్నులు ఫైల్ చేయడానికి అతి ముఖ్యమైనది ఫారం-16 ఫార్మాట్ మారింది. ఫారం-16 ఫార్మాట్‌లోని మార్పుల గురించి చూస్తే జీతం పొందే వారు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈసారి చేసిన మార్పులు పన్ను రిటర్నులను ఫైల్ చేయడాన్ని చాలా ఈజీ చేసినట్లు చెబుతున్నారు.

ఫారం-16లో ఎం మారింది: ఈ సంవత్సరం ఫారం-16 ఫార్మాట్‌లో కొత్త మార్పులు జరిగాయి. కొత్త ఫార్మాట్ గతంలో కంటే మరింత వివరంగా, స్పష్టమైన సమాచారాన్ని అందిస్తుంది. ఇంతకుముందు దీనిలో ప్రైమరీ సమాచారం మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు పన్ను అలవెన్సుస్, డిస్కౌంట్స్ అండ్ పన్ను విధించదగిన జీతం గురించి పూర్తి సమాచారం ఉంటుంది. దీని బట్టి చూస్తే ఐటీఆర్ ఫైల్ చేయడం ఈజీ అలాగే క్లియర్'గా ఉంటుంది.
ఫారం-16 అంటే ఏమిటి: ఫారం-16 అనేది కంపెనీ ఉద్యోగులకు ఇచ్చే డాక్యుమెంట్. ఇందులో ఉద్యోగి జీతం, పన్ను మినహాయింపు (TDS) గురించి సమాచారం ఉంటుంది. ఈ డాక్యుమెంట్ ఐటీఆర్ దాఖలు చేయడంలో సహాయపడుతుంది ఇంకా కంపెనీ ఉద్యోగి జీతం నుండి టీడీఎస్ తగ్గించి ఆదాయపు పన్ను శాఖలో జమ చేశారని ప్రూఫ్ చేస్తుంది. మీరు ఉద్యోగాలు మారినప్పటికీ, ప్రతి సంస్థ నుండి ఫారం-16 పొందడం తప్పనిసరి. ఫారం 16 పార్ట్ A అండ్ పార్ట్ B అనే రెండు భాగాలుగా ఉంటుంది.
ఫారం-16లోని పార్ట్-ఎ: పార్ట్-ఎలో కంపెనీ ప్రతి త్రైమాసికంలో తగ్గించిన, జమ చేసిన పన్నుకు సంబంధించిన సమాచారం ఉంటుంది. దీనిలో ఉద్యోగి పేరు, అడ్రస్, పాన్ నంబర్, కంపెనీ పన్ను మినహాయింపు అకౌంట్ నంబర్ (TAN) అండ్ పాన్ నంబర్ ఉంటాయి. ఈ సెక్షన్ ఉద్యోగి జీతం స్లిప్‌లో పన్ను చెక్ చేయడానికి సహాయపడుతుంది.
ఫారం 16లోని పార్ట్ బి: ఉద్యోగి జీతం, ఆదాయపు పన్ను చట్టం కింద ఇచ్చిన మినహాయింపుల గురించి పూర్తి సమాచారం ఉంటుంది. ఇందులో సెక్షన్ 10 (HRA వంటివి) కింద మినహాయింపులు అలాగే సెక్షన్ 80C అండ్ 80D (జీవిత బీమా, ఆరోగ్య బీమా, PPF వంటివి) కింద తగ్గింపులు ఉన్నాయి. ఐటీఆర్ ఫైల్ చేయడంలో ఈ సెక్షన్ చాలా ముఖ్యమైనది.
ఫారం 16 ఎందుకు అవసరం: ఫారం-16 ఐటీఆర్ ఫైల్ చేయడంలో సహాయపడటమే కాకుండా, లోన్ తీసుకోవడానికి కూడా అవసరం. బ్యాంకులు అలాగే ఆర్థిక సంస్థలు దీనిని మీ ఆదాయానికి ప్రూఫ్'గా పరిగణిస్తాయి. ఉద్యోగి ఎక్కువ TDS చెల్లించినట్లయితే, ఫారం-16 ద్వారా రిటర్న్ పొందవచ్చు.


Click it and Unblock the Notifications